Advertisement
Google Ads BL

పవన్‌ హీరోల పోరు ఖరారు..!


ఆగష్టు11.. ఈ తేదీ కోసం ఎందరో ట్రై చేస్తున్నారు. కానీ ఈ తేదీని మన పెద్ద హీరోలు క్యాష్‌ చేసుకునేలా కనిపించడం లేదు. అయినా ఆ రోజు ఓ రసవత్తరపోరుకు రంగం సిద్దమవుతోంది. ఇద్దరు పవన్‌ హీరోలు పవన్‌ ఫ్యాన్స్‌లో ఎవరికి ఎక్కువ క్రేజ్‌ ఉందో తెలుసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఒకరు తన తండ్రి సాయంతో హీరోగా ఎదుగుతూ, తొలిప్రేమ నుంచి పవన్‌నే దైవంగా భావిస్తూ, ఆయన్నే అనుకరించాలని, ఆయనలాగే తన నడక, నడత, పాటలు, స్టెప్స్‌ వంటివి ఉండాలని ఆరాటపడే నితిన్‌.. కాగా రెండో వ్యక్తి పవన్‌ని చిన్న సొంత మేనమామగానే గాకుండా ఆయన స్టైల్‌ని కూడా అనుకరిస్తూ, స్వతహాగా జీన్స్‌పుణ్యమా అని వచ్చిన పోలికలతో పవన్‌ ఫ్యాన్స్‌ని అలరిస్తున్న సాయిధరమ్‌తేజ్‌. 

Advertisement
CJ Advs

ఇక నితిన్‌ అయితే పవనే నాకు దేవుడు అని చెబుతాడు. పట్టుబట్టి పవన్‌ని తన సినిమా ఆడియోకి రప్పించి సెకండ్‌ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టాడు. ఆయన ప్రస్తుతం 14రీల్స్‌ పతాకంపై టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హనురాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ జంటగా 'లై' (అబద్దం) అనే చిత్రం చేస్తున్నాడు. లాంగ్‌ వీకెండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని ఈ చిత్రం విడుదలతేదీని ఆగష్టు11కి లాక్‌ చేశారు. ఈ చిత్రం స్టిల్స్‌లో కూడా 'తమ్ముడు' ఛాయలు కనిపిస్తున్నాయి. 

ఇక 'తిక్క, విన్నర్‌' చిత్రాలతో బోల్తాపడి, తన మామ పవన్‌ సహకారంతో తన మొదటి చాన్స్‌ని 'రేయ్‌' ద్వారా పొందిన తేజు ప్రస్తుతం రచయిత బి.విఎస్‌ రవి దర్శకత్వంలో 'జవాన్‌' చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన తన ఇద్దరు మామయ్యలు తనకు రెండు కళ్లని చెబుతుంటాడు. ఈ చిత్రం కూడా ఆగష్టు11నే విడుదల కానుంది. అయితే ఈ రెండు చిత్రాలలోనూ నితిన్‌ చిత్రానికి హను దర్శకుడు కావడం, 'జవాన్‌' చిత్రానికి పెద్దగా టాలెంట్‌ లేదని విశ్లేషకులు తేల్చేసిన బి.వి.ఎస్‌.రవి దర్శకుడు కావడంతో నితిన్‌ 'లై' మీదనే ఇండస్ట్రీలో పాజిటివ్‌ బజ్‌ ఉందనేది వాస్తవం. 

'LIE' Movie and 'Jawan' Movie Release on 11th August 2017:

August 11th .. Many people are preparing for this date. But our big heroes do not seem to get this date cashed. Both Pawan's heroes are competing to get to know who is in the pawan fans.Nithiin acted movie 'LIE' and Sai dharam tej acted movie 'Jawan' this two movie release as same date on 11th august 2017.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs