Advertisement
Google Ads BL

'పైసా వసూల్' కి షాడో డైరెక్టర్ నిజమేనా..?


బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కే 'పైసా వసూల్' పై షాకింగ్ రూమరోకటి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'పైసా వసూల్' పై ఇప్పడు కొత్తగా ఒక న్యూస్ వినబడుతుంది. పూరి ఈ చిత్రాన్ని చెయ్యడానికి చాలా తక్కువ టైం ని సెట్ చేశాడు. అయినా పూరి సినిమాలన్నీ ఇలా తక్కువ టైంలోనే తెరకెక్కుతాయి. సినిమా మొదలు పెట్టిననాటి నుండి ఐదారు నెలల్లో సినిమా విడుదలకు సిద్దమైపోతుంది. మరి ఇప్పుడు కూడా పూరి, బాలకృష్ణ 'పైసా వసూల్' చిత్రాన్ని సెప్టెంబర్ లో దసరాకి విడుదల చేస్తానని అంటున్నాడు.

Advertisement
CJ Advs

అయితే సినిమాను అతి తక్కువ టైములో ఫినిష్ చేయడానికి పూరి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఎన్నుకున్నాడట. అదేమిటంటే పూరి జగన్నాధ్ సినిమా విడుదలకు టైం తక్కువ ఉండడంతో పూరి కేవలం బాలయ్య తో ఇన్వాల్వ్ అయినా సీన్స్ ని తెరకెక్కిస్తూ... మిగతా నార్మల్ సీన్స్ ని మరో సెకండ్  డైరెక్టర్ కి అప్పగించాడట. టాలీవుడ్ లో 'బిల్లా, కంత్రి, శక్తి, షాడో' వంటి సినిమాలు చేసిన మెహర్ రమేష్ ని  పూరి 'పైసా వసూల్' కోసం సెకండ్ డైరెక్టర్ గా చేసాడని అంటున్నారు. ప్రస్తుతానికి మెహర్ కి టాలీవుడ్ హీరోస్ ఎవరూ ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మెహర్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు పూరి తన సినిమాల్లో స్టయిలిష్ విలన్ల షాట్స్ అన్నీ తీసేపని మెహర్ కు అప్పజెప్పాడని టాక్ వినబడుతుంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఈ విషయం తెలిసినప్పటినుండి నందమూరి ఫ్యాన్స్ కి మాత్రం చమటలు పట్టేస్తున్నాయి. ఒక ప్లాప్ డైరెక్టర్ తో ఇలా బాలయ్య సినిమా లో కొన్ని సీన్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ బాలయ్య చిత్రం 'పైసా వసూల్' పై పడుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఇదంతా కేవలం ఒక రూమర్ అని మెహర్, బాలయ్య సినిమాకి ఎటువంటి లింక్ లేదని 'పైసా వసూల్' చిత్ర యూనిట్ చెబుతుంది. ఇకపోతే 'పైసా వసూల్' లో శ్రియ శరణ్, ముస్కాన్ లు హీరోయిన్స్ కాగా కైరా దత్ ఒక ఐటెం సాంగ్లో నటిస్తుంది.

Shadow Director to Balayya Paisa Vasool:

Shadow Director Mehar Ramesh To work for Balakrishna and Puri Jagannadh Paisa Vasool. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs