Advertisement
Google Ads BL

మంచు మనోజ్ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు?


హీరో మంచు మనోజ్ సడన్ గా షాక్ ఇచ్చాడు. తాను హీరోగా చేస్తున్న చివరి సినిమా  'ఒక్కడు మిగిలాడు' తర్వాత మరొక మూవీ అంటూ.... సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు. నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నట్లు చెప్పిన మనోజ్.... కారణం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మనోజ్ ఇండస్ట్రీలోకి 'శ్రీ' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి  విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా స్థిరపడిన మంచు మనోజ్ కి కెరీర్ లో పదికాలాలు గుర్తుండిపోయే హిట్ లేకుండా పోయింది. కానీ మనోజ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడుతూనే వున్నాయి. 

Advertisement
CJ Advs

మరి సినిమాలో హీరోగా చేస్తున్న మనోజ్ కి  స్క్రిప్ట్‌ దగ్గర్నుంచి యాక్షన్‌, డాన్సులు వంటి విషయాల్లో కూడా  గట్టి పట్టే వుంది. ఇప్పుడు తాజాగా మంచు మనోజ్  'ఒక్కడు మిగిలాడు' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటువంటి టైం లో సినిమాలకు గుడ్ బై చెప్పడమనేది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మరో మూవీ లైన్ లో ఉన్న మనోజ్ ఇప్పుడు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అభిమానులకు థాంక్స్ చెబుతూ 'ఒక్కడు మిగిలాడు.. ఆ తరువాత మరో సినిమా.. ఇవే నా ఆఖరి సినిమాలు. నటనకు ఇక  బై బై చెబుతున్నానని' చెప్పి మనోజ్ అందరికి షాక్ ఇచ్చాడు.

అయితే నటనకు స్వస్తి పలుకుతున్నానన్నాడే...  గాని ఇండస్ట్రీ నుండి తప్పుకుంటున్నట్లు చెప్పలేదు. అంటే హీరోగా బై బై చెప్పిన మనోజ్ ఒక నిర్మాతగానో... లేకపోతే ఒక డైరెక్టర్ గానో సినిమా ఇండస్ట్రీలో స్థిరపడతాడేమో అనే టాక్ మాత్రం వినబడుతుంది. మరి ఈ డెసిషన్ మనోజ్ తన తండ్రి మోహన్ బాబు కి చెప్పి ఆయన్ని ఒప్పించే తీసుకున్నాడో? లేదంటే తన సొంత  డెసిషనా అనేది  కూడా కాస్త సస్పెన్స్ గానే వుంది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో నటనకు ఎందుకు స్వస్తి చెబుతున్నాడో మనోజ్ క్లారిటీ ఇస్తేనే గానీ తెలియదు. 

Manchu Manoj To Quit Acting, True or False:

Manoj is a very talented artist and there’s still more time to fulfill his other ambitions of doing the social service or even his political aspirations.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs