Advertisement
Google Ads BL

మరోసారి దుమ్మురేపడానికొస్తున్నాడు..!


ప్రస్తుతం ఖాన్‌ త్రయంలో ఒకడైన సల్మాన్‌ ఖాన్‌ జోరు మామూలుగా లేదు. రంజాన్‌ కానుకగా ఆయన నటించిన 'ట్యూబ్‌లైట్‌' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. 'ఏక్‌థాటైగర్‌, బజరంగీ భాయిజాన్‌'ల తర్వాత సల్మాన్‌ ఖాన్‌-ఖబీర్‌ ఖాన్‌ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. ఇక ఇండో-చైనా వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ మానసికంగా ఎదగని హీరోకి, ఓ చైనీ అమ్మాయికి మద్య జరిగే ప్రేమకథా చిత్రంగా పూర్తి స్థాయి కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రం రూపొందుతోంది. 

Advertisement
CJ Advs

కాగా ఇంత కాలం షారుఖ్‌ ఖాన్‌ నటించిన పలు చిత్రాలలో సల్మాన్‌ ఖాన్‌ కామియో తరహా పాత్రలు చేశాడు. 'ట్యూబ్‌లైట్‌'లో దానికి ప్రతిఫలంగా షారుఖ్‌ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ జిందా హై' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక పనిలో పనిగా ఈ ఖాన్‌ స్టార్‌ మన తెలుగు స్టార్స్‌ వలే కాకుండా ఓ చిత్రాన్ని అంటే 'ట్యూబ్‌లైట్‌'ని విడుదలకు సిద్దం చేసి, 'టైగర్‌ జిందాహై'లో నటిస్తూ తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రెడీ అయిపోయాడు. 

కాగా ఈ చిత్రం 'దబాంగ్‌'కి సీక్వెల్‌ కావడం సల్మాన్‌ అభిమానులకి పండుగేనని చెప్పాలి. గతంలో 'దబాంగ్‌', 'దబాంగ్‌2' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు కురిపించాయి. ఈ రెండు సీక్వెల్స్‌ను ఆయన సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ దర్వకత్వం వహించాడు. కాగా ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ తన సోదరుడు చెప్పిన 'దబాంగ్‌3'ని పక్కనపెట్టి 'వాటెండ్‌2'కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఈనేపధ్యంలో మీడియా ఎదుట అర్బాజ్‌ ఖాన్‌ తన సోదరుడు సల్మాన్‌ ఖాన్‌ తీరును కూడా సునిశితంగా తప్పుపట్టాడు కానీ ఎట్టకేలకు 'వాటెండ్‌2' వెనక్కి వెళ్లిపోయింది. 'దబాంగ్‌3' తెరపైకి వచ్చింది. 

కాగా 'దబాంగ్‌, దబాంగ్‌2'లకు అర్భాజ్‌ ఖానే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మరి కారణాలేమైనా గానీ 'దబాంగ్‌3'కి మాత్రం దక్షిణాది కొరియోగ్రాఫర్‌, ఉత్తరాది దర్శకుడు, రీమేక్‌ కింగ్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించనుండటం విశేషం.ఈ చిత్రంలో మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ కూడా ఉంది. పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన సల్మాన్‌ ఖాన్‌ ప్రేయసి అమీ జాక్సన్‌ ఈ 'దబాంగ్‌3'లో తన ప్రియుడితో పాటు చట్టాపట్టాలేసుకోనుంది. ఇది నిజంగా ఈమెకి పెద్ద అవకాశమే అని చెప్పాలి. హీరోయిన్లుగా ఎందరికో బ్రేక్‌ నిచ్చి, మరీ ముఖ్యంగా తనకు ఎఫైర్‌ ఉన్నవారికి హిట్‌ ఇవ్వందే వదలని సల్మాన్‌ ఖాన్‌ ఆమెకి మాత్రం ఇంత వరకు సక్సెస్‌ ఇవ్వడంలో విఫలమయ్యాడు. 

ఇక 'ఐ' తర్వాత ప్రస్తుతం అమీ జాక్సన్‌ ఇండియాలోనే ప్రతిష్టాత్మక చిత్రంగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌- బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌లు కలిసి నటిస్తున్న '2.0'పై బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. మరి ఈ చిత్రం హిట్టయి, 'దబాంగ్‌3' సమయానికి అమీ జాక్సన్‌ మంచి పేరు తెచ్చుకుంటుందో లేక తన ప్రియుడే ఆమెకు బ్రేక్‌ నిస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Salman Khan and Kabir Khan Combo Hat Trick Movie:

Salman Khan, who is currently one of the Khan trio, is not routine. Ramzan is getting ready for release of his film 'TubeLight'. The film is a hat-trick film in the combination of Salman Khan and Kabir Khan after Ekithaigar, Bajrangi Bhojaan. The film is going to be a full fledged comedy entertainer with a heroine who is not a mentally unstable hero.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs