Advertisement
Google Ads BL

బాలీవుడ్‌ చూపంతా ఓ తల్లి.. ఇద్దరు కూతుళ్ల మీదే!


అతిలోక సుందరి శ్రీదేవి తన కూతుర్లిద్దరినీ హీరోయిన్లను చేస్తానని ఎప్పటి నుంచో చెబుతోంది. దాంతో బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ కోలీవుడ్‌ వరకు అందరి చూపు శ్రీదేవి ఇద్దరు కూతుర్ల మీదే. హీరోయిన్లుగా ఎంట్రీ ఇప్పిస్తానని చెబుతున్నా, ఎప్పుడు? ఎవరితో? ఏ చిత్రం ద్వారా? అనే విషయాన్ని మాత్రం శ్రీదేవి నోటి నుంచి మీడియా ఇప్పటి వరకు స్పష్టంగా క్లారిటీగా చెప్పించలేకపోయింది. 

Advertisement
CJ Advs

ఆ ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి శ్రీదేవి తెలివిగా జర్నలిస్ట్‌లను పక్కదారి పట్టిస్తూ వస్తోంది. ఇక శ్రీదేవి కూతురుని, చిరంజీవి కుమారుడైన రామ్‌ చరణ్‌లతో 'జగదేక వీరుడు-అతిలోక సుందరి'ని రీమేక్‌ చేయాలని చిరు, రాఘవేంద్రరావులతో పాటు నిర్మాత అశ్వనీదత్‌ కూడా చేస్తున్నాడు. ఇక శ్రీదేవి కూతురిని తన చిన్నకొడుకు పక్కన చూపించాలని నాగార్జున సైతం ముచ్చటపడుతున్నాడు. సామాన్యంగా పారితోషికం విషయంలో ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండే నాగార్జున వంటి బిజినెస్‌ పర్సన్‌ కూడా శ్రీదేవి కూతురు ఓకే అంటే అఖిల్‌ పక్కన నటించడానికి ఎంత కావాలి? ఎంతైనా ఇస్తాను? అని కూడా ఎంక్వైరీ చేశాడంటున్నారు. 

కానీ వీరెవ్వరికీ అంతు చిక్కని కథగా శ్రీదేవి కూతుర్లయిన జాహ్నవి కపూర్‌, ఖుషీ కపూర్‌ల పయనం సాగుతోంది. తాజాగా ఈ తల్లి తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఓ రాత్రి ఓ స్పెషల్‌ డిన్నర్‌కు అంటెండ్‌ అయ్యారు. వారు ముగ్గురు పక్కపక్కన నడిచి వస్తుంటే ఓ విశ్వసుందరి, ప్రపంచసుందరిల ఎంపికలో చేసినట్లుగా ర్యాంప్‌ వాక్‌ చేస్తున్నట్లుగా అందరూ కన్నార్పకుండా వారివైపు చూస్తూ తమను తాము మైమర్చిపోయారంటే అతిశయోక్తికాదు. 

ఇక శ్రీదేవి మొదటగా జాహ్నవి కపూర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయనుంది? ఏ హీరో? ఏ వారసుడు? అనే విషయాన్ని పక్కన పెడితే మరఠాలో కేవలం 4కోట్ల బడ్జెట్‌లో నిర్మించబడి ఏకంగా 100కోట్లకు పైగా వసూలు చేసిన 'సైరాట్‌' మూవీ బాలీవుడ్‌ రీమేక్‌లో ఆమె హీరోయిన్‌గా పరిచయం కానుందని, అందుకోసం ముందుగా తాను తీసుకున్న ప్రామిస్‌ నిమిత్తం కరణ్‌ జోహార్‌ చేత శ్రీదేవి ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ని కూడా పొందించేలా చేసిందని స్పష్టమైన సమాచారం. 'సైరాట్‌' మూవీ ద్వారా తన పెద్ద కూతురు జాహ్నవిని తెరంగేట్రం చేయాలనే ప్రపోజల్స్‌ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఇంకా ఖరారు కాలేదని మరోసారి ఆమె తండ్రి బోనీకపూర్‌ స్పష్టం చేయడం విశేషం...!

Bollywood Total Focus on Sridevi and Daughters:

At that time, Sridevi says that she will make heroines both of her daughters. From Bollywood to Tollywood Kollywoods Focus on Sridevi has two daughters.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs