మెగాస్టార్ చిరంజీవిని దాదాపు అజాత శత్రువుగా చెప్పుకుంటారు. కానీ ఆయన రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత మాత్రం స్వర్గీయ దాసరి నుంచి మోహన్ బాబుతో కూడా వైరం ఏర్పడింది. కానీ ఇది రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కాదు అనీ.. వారిమద్య ఎప్పటి నుండో విబేధాలున్నాయని పరిశ్రమని బాగా ఎరిగిన వారు చెబుతారు. ఇక తమిళ 'రమణ' రీమేక్ హక్కులను మొదట యాంగ్రీ ఓల్డ్‌మేన్ రాజశేఖర్ తీసుకోవాలని భావించి, కొంత ఒరిజినల్ నిర్మాతలకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడంటారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రీమేక్ హక్కులను రాజశేఖర్‌కి దక్కనివ్వకుండా చిరు అండ్ కోతోపాటు ఠాగూర్ మధు కూడా పాచికలు కదిపాడని ప్రచారం.
దీంతో 'రమణ'కు రీమేక్‌గా వచ్చిన 'ఠాగూర్' రాజశేఖర్ చేతులు దాటి చిరంజీవి చేతుల్లోకి వెళ్లి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక రాజశేఖర్ నటించిన 'ఎవడైతే నాకేంటి' చిత్రం తమిళ ఒరిజినల్ 'లయన్' హక్కులను కూడా చిరంజీవి తనకున్న పలుకుబడితో రాజశేఖర్‌కి దక్కనివ్వకుండా చేయాలని ప్రయత్నించాడని, చిరంజీవి అండ్ కో బెదిరింపులు కారణంగానే ఈ చిత్ర అసలు దర్శకుడు సముద్ర ఈ చిత్రం నుంచి బయటకు వెళ్లిపోతే మిగిలిన పార్ట్‌ని జీవిత సొంతగా డైరెక్ట్ చేసుకుందని కూఆ సమాచారం. రాజశేఖర్ పరంగా చెప్పుకోవాలంటే 'గోరింటాకు, ఎవడైతే నాకేంటి' చిత్రాలే రాజశేఖర్‌కి చివరగా చెప్పుకోదగిన చిత్రాలు, ఇక ఇవే మనసులో ఉంచుకుని రాజశేఖర్, జీవితలు చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీని స్థాపించినప్పుడు మీడియా ఎదుటే చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు.
ఆ తర్వాత రాజశేఖర్ రైలులో హైదరాబాద్ రావడం, ఇంటికి కారులో వెళ్తుండగా మెగాభిమానులు ఆయనపై దాడి చేయడం జరిగిందంటారు. కానీ తృటిలో రాజశేఖర్ తప్పించుకున్నాడు. స్వయాన జీవిత ఈ దాడికి మెగాభిమానులు కారణమని, ముఖ్యంగా చిరంజీవికి, అల్లు అరవింద్‌కు ముఖ్యుడు, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు వ్యవహారాలు చూసే ఆల్‌ఇండియా చిరంజీవి ప్యాన్స్‌కి చెందిన వీరాభిమాని స్వామినాయడే అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ తర్వాత మాట మార్చింది. రాజశేఖర్‌పై జరిగిన దాడిలో తన కూతుర్లు తృటిలో తప్పించుకున్నారని, లేకపోతే తన పిల్లల, భర్త ప్రాణాలు పోయేవని చెప్పింది.
ఆ తర్వాత రాజశేఖర్‌పై దాడి విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులతో పాటు మోహన్‌బాబు స్వయాన చిరంజీవి కూడా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ఈ గొడవ కాస్త సద్దుమణిగింది. ఒకానొక సమయంలో చిరంజీవి 150వ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ అయితే తానే స్వయంగా నటిస్తానని, చిరుకి,తనకు ఇప్పుడు సంబంధాలు బాగున్నాయని, మెగాబ్రదర్ నాగబాబు తమను ఏకం చేశాడని రాజశేఖర్ ప్రకటించాడు. అంతేకాదు.. త్వరలో తన ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని,తాను జీవిత స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి వాళ్లను ఆహ్వానిస్తామని చెప్పారు.
కానీ ఇంతకాలం జరిగినా వీరి మద్య సయోద్య ఇంకా కుదరలేదని ఫిల్మ్‌నగర్ గుసగుసలాడుకుంటోంది. తాజాగా జరిగిన దాసరి సంతాప సభకు చిరంజీవి మాట్లాడి వెళ్లిపోయిన తర్వాతే రాజశేఖర్, జీవితలు వచ్చారు. ఇది యాధృచ్చికంగా జరిగిందని చాలామంది భావిస్తుంటే విషయం బాగా తెలిసిన వారు మాత్రం రాజశేఖర్ దంపతులు ముందుగానే సంతాప సభక వచ్చినప్పటికీ చిరంజీవి ప్రసంగిస్తున్నాడని తెలిసి, కారులోనే వెయిట్ చేసి, చిరు ప్రసంగించి వెళ్లిన తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చారని అంటున్నారు.