Advertisement
Google Ads BL

పవన్.. సినిమా కాస్త సస్పెన్సుగానే వుంది?


పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయిందా..? అంటే త్రివిక్రంతో పవన్ చేసే సినిమా ఆగిపోలేదు. త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ కమిట్ అయిన ఏ.ఎం రత్నం సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. డైరెక్టర్ నేసన్ డైరెక్టర్ గా ఏ. ఎం రత్నం నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాని చెయ్యాల్సి వుంది. ఇక ఈ సినిమాని పవన్ ఎప్పుడో పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. అయితే ఈ మధ్యన ఆ సినిమాపై అనేక రకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్, ఏ. ఎం రత్నం చిత్రం కోసం తీసుకున్న అడ్వాన్స్    తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రాజెక్ట్ నుండి పవన్ ఎందుకు తప్పుకుంటున్నాడనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదుగాని.... పవన్, త్రివిక్రమ్ సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి 2019  ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తున్నాడట. అందుకే ఇలా ఏ. ఎం రత్నం చిత్రానికి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశాడనే గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాకపోతే విషయం ఏదైనప్పటికీ పవన్ - నేసన్ ప్రాజెక్ట్ అటకెక్కేసిందనే వార్త మాత్రం బాగా ప్రచారం జరుగుతుంది. 

మరి త్రివిక్రమ్ సినిమాకే ఈ ఏడాది అంతా సరిపోవడం వలన ఎన్నికలకు సమయం లేకపోవడం వలన పవన్ ఇలా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నాడా? లేకపోతె పవన్  మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చెయ్యడానికే ఇలా చేస్తున్నాడనే విషయం మాత్రం కాస్త సస్పెన్సుగానే వుంది.

Pawan Kalyan's is Stop The Movies:

Pawan Kalyan's cinema stopped? Pawan's film with Trivikram does not stop. After the Trivikram movie, Pawan Kalyan, A.M. Ratnam cinematic news has been reported.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs