ఒకప్పుడు ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శృతి హాసన్... పవన్ కళ్యాణ్ పక్కన 'గబ్బర్ సింగ్' లో నటించి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అప్పటి నుండి తెలుగు, తమిళంలో బిజీ అయినా శృతి హాసన్ స్టార్ హీరోలందరితో జోడి కడుతూనే.... బాలీవుడ్ మీదున్న మోజుతో వీలుచిక్కినప్పుడల్లా హిందీ ఫిలింలోనూ నటిస్తుంది. అయితే కొన్నాళ్ళు గోల్డెన్ లెగ్ గా టాప్ పోస్జిషన్ లో ఉన్న శృతి ప్రస్తుతం సినిమాలు చేతిలో లేక ఏవేవో కబుర్లు చెబుతుంది. మొన్నటికిమొన్న 'కాటమరాయుడు'లో డీ గ్లామరస్ గా కనిపించిన శృతి హాసన్ పై నెగెటివ్ కామెంట్స్ పడిన విషయం మరువక ముందే తమిళంలో 'సంఘమిత్ర' చిత్రం నుండి తప్పుకుని ఓవరేక్షన్ చేసింది.
దెబ్బకి అమ్మడి చెంతకు అవకాశాలు రాకుండా పోయాయి. అయితే అలా అవకాశాలు రాకుండా పోవడాన్ని శృతి బాగానే కవర్ చేస్తుంది. ఎలా అంటే సినిమాల్లో నటించడంతోపాటే మరికొన్ని విషయాల్లో శృతి బిజీ కావాలనుకుంటుందట. తనకు పరిచయమున్న మ్యూజిక్ తోపాటే, సినిమాలకు స్క్రిప్టులు తయారు చెయ్యడం, పాటలు పాడడంవంటివి కూడా చేస్తుందట. మ్యూజిక్ మీద పూర్తి దృష్టి పెడుతున్నానని... అలాగే ఒక మ్యూజిక్ అల్బాక్ కూడా తయారు చేసి పాటలు పాడడం వంటివి చేస్తానని చెబుతుంది. అలాగే సినిమాలకు స్క్రిప్టులు కూడా తయారు చేస్తానంటుంది.
ఇలాంటివి చెయ్యడం వలెనే సినిమాలను కాస్త తగ్గించమని చెబుతుంది. మరి అవకాశాలు తగ్గడం వలనో? లేక నిజంగానే శృతి ప్రయార్టీస్ మారాయో గాని ఇప్పుడు అమ్మడు మాత్రం అన్ని రాంగాలలో తనదైన ముద్ర వెయ్యడానికి రెడీ అవుతుందన్నమాట.