అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న డిజె ఆడియో వేడుకని ఈ ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విడుదల చేశారు. చిత్ర యూనిట్ మొత్తం హాజరయిన ఈ ఆడియో వేడుకకి అల్లు అర్జున్ భార్య స్నేహ , కొడుకు అయాన్, కూతురు ఆర్హ తో పాటు హాజరవగా... డిజె నిర్మాత దిల్ రాజు తన కూతురు, అల్లుడు, మనవడితో సహా హాజరై డిజె ఆడియో ని ఆవిష్కరించారు. అయితే డిజె ఆడియో వేడుకలో అల్లు అర్జున్ అన్ని తానై వ్యవహరించాడు. అభిమానులకు పాస్ లు ఇవ్వడందగ్గర నుండి మిగతా విషయాల వరకు అన్ని దగ్గరుండి చూసుకున్నాడని అంటున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు అల్లు అర్జున్ తీసుకోవడం వెనుక ఒక కారణం ఉందని.... పవన్ ఫ్యాన్స్ వల్ల మెగా ఫంక్షన్స్ స్పాయిల అవుతున్నాయని... అందుకే పవన్ ఫ్యాన్స్ ని ఈ వేడుకకి రాకుండా అల్లు అర్జున్ ప్లాన్ చేశాడని అంటున్నారు.
అల్లు అర్జున్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏమిటి చెప్పండి డిజె డైరెక్టర్ హరీషే... పవన్ కళ్యాణ్ కి వీరాభిమానియే. అందుకే పవన్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ స్పీచ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మెడమీద షర్ట్ కాలర్ లో చెయ్యిపెట్టి ఒక స్టైల్ లో కటింగ్ ఇస్తాడే అలాంటిదన్నమాట. అలా హరీష్ అక్కడ చేసే సరికి మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయి సందడి చేశారు. అలాగే హరీష్, అల్లు అర్జున్ గురించి మరో విషయాన్ని డిజె ఆడియో వేడుకలో అభిమానులతో పంచుకున్నాడు. డిజె చిత్రానికి అల్లు అర్జున్ కొన్ని ఐడియాస్ ఇచ్చాడట. అదేమిటంటే క్లైమాక్స్ కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రీ క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ పెట్టి క్లైమాక్స్ లో మాత్రం ఫైట్ లేకుండా కొత్తగా ముగించామని డైరెక్టర్ హరీష్ చెబుతున్నాడు. మరి దీన్ని చూస్తుంటే హరీష్ శంకర్, అల్లు అర్జున్ కి ఎక్కువ క్రిడిట్ ఇచ్చేసినట్టు లేదూ...!