Advertisement
Google Ads BL

డిజె అదనపు ఆకర్షణలా లేదూ..?


అల్లు అర్జున్ - హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'డిజె దువ్వాడ జగన్నాథం' చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాలను షురూ చేసింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ 'డిజె' ఆడియో తాజాగా శిల్పకళావేదిక  హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే చిత్ర యూనిట్ మొత్తం 'డిజె' ఆడియోలో పాల్గొని సందడి చేశారు. అయితే ఇక్కడ 'డిజె' ఆడియో లో ఒక అదనపు ఆకర్షణ కూడా కనబడింది. అదేమిటంటే అల్లు అర్జున్ తన భార్య స్నేహ, కూతురు అర్హా, కొడుకు ఆయాన్ లతో డిజె ఆడియో వేడుకకి హాజరై అందరికి సర్ప్రైజ్ఇచ్చాడు. మరి తాను మాత్రమే డీజే ఆడియో వేడుకకి రాకుండా ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ తో హాజరై 'డిజె' ఆడియో వేడుకకు ఒక నిండుదనం తీసుకొచ్చాడని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక అల్లు స్నేహ తన కూతురు అర్హ ని ఎత్తుకుని వస్తున్నప్పుడు...  డిజె ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లు స్నేహని దగ్గరుండి మరీ ఆడియో వేడుక వేదిక దగ్గరకు తీసుకొచ్చాడు. మరి ఇలా అల్లు అర్జున్ ఫ్యామిలీని కనులారా వీక్షించిన బన్నీ ఫ్యాన్స్ పులకించిపోయి అల్లు అర్జున్ కి జేజే లు పలికారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో డిజె ఆడియో కి అటెండ్ అవ్వడమేకాక ఆడియో వేడుకపైకి ఫ్యామిలీతో సహా ఎక్కి సందడి చేశారు. ఇక అక్కడ అల్లు అయాన్... అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి దండం పెట్టె ఫోజ్ ఉంది చూశారూ... అప్పుడే అల్లు అయాన్ రంగంలోకి దిగిపోయినట్టు లేదూ... ఇక డిజె ఆడియో సీడ్ ని తన ఫ్యామిలీ సమక్షంలో ఓపెన్ చేసిన అల్లు అర్జున్.... హరీష్ శంకర్, పూజ హెగ్డేలకు డిజె  సీడీలను అందించాడు.  

ఇక ఈ నెల 23న విడుదల కానున్న డిజె చిత్రం పై భారీ అంచనాలే వున్నాయి. మార్కెట్ లోకి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఇపుడు మిగతా సాంగ్స్ ని కూడా ఆడియో వేడుక ద్వారా విడుదల చేశారు. అలాగే డిజె థియేట్రికల్ ట్రయిలర్ కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.

Allu Ayaan's Namaskaram to Audience:

DJ - Duvvada Jagannadham's audio launch ceremony. Dil Raju's grandson, Stylish Star Allu Arjun's son Allu Ayaan and daughter Arha impressed everyone at the venue with their cute looks and gestures. He gestured 'Namaskaram' to the audience as if he were the hero of the film. Seeing the kid's pose, anchor Suma complimented that had come from blood.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs