Advertisement
Google Ads BL

కష్టపడితేనే ఇక్కడ ఉండగలం..!


సినిమా ఇండస్ట్రీలో వారసత్వానికి పెద్ద పీటే వేస్తున్నారు. డబ్బు, పవర్ ఉంటె ఎక్కడైనా నిలదొక్కుకోవచ్చని.. అవి రెండు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడడం కష్టమనే మాట చాలామంది హీరోయిన్స్ నోటి వెంట వింటూనే వున్నాము. ఇండస్ట్రీలో సినీ వారసులకు మంచి అవకాశాలు వస్తాయి.... వారి వారసత్వాలే వారిని స్టార్స్ చేస్తాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం వాటిని కొట్టిపడేస్తున్నారు. మరికొంతమంది  సినీవారసత్వం వున్నా కూడా కష్టపడితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని... డంఖా బజాయిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శృతి హాసన్ కి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీలాంటి సినీ వారసులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సినీ వారసత్వమే కారణం కదా... అని అడగ్గా.. దానికి సమాధానంగా శృతి చాలా పెద్ద సమాధానమే చెప్పింది. తాను ఇలా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడంలో తన తండ్రి కమల్ పాత్రగాని... తల్లి పాత్రగాని అస్సలు లేదని చెబుతుంది. నేను కేవలం నా కష్టంతోనే పైకి వచ్చానని చెబుతుంది. ఒక్క నేనే కాదు ఎవరి సినీ వారసులైన కష్టపడితేనే పైకి వస్తారని... అది వారి ప్రతిభమీదే ఆధారపడి ఉంటుంది అందులో వారసత్వ పాత్ర ఏం ఉండదనే గడుసైన జావాబిచ్చింది.

నిజంగానే కమల్ ప్రోత్సాహం లేకుండానే శృతి హాసన్ స్టార్ హీరోయిన్ అయ్యిందా..? ఒకప్పుడు శృతి ని హీరోయిన్ గా తీసుకోవాలంటే భయపడిన వారు కమల్ ని చూసి ఆమెకి అవకాశాలు ఇవ్వలేదంటా...? ఏమో శృతి చెప్పినదాని బట్టి చూస్తే కమల్ తో ప్రమేయం లేకుండానే ఇలా హీరోయిన్ గా దూసుకుపోతుందేమో? అన్న విషయాలు ఆమెకే వదిలివేయాలి.

Shruti Haasan is Told Without Kamal Haasan Help:

There is a big peet of legacy in the film industry. There are so many people that we can not stand anywhere without the power to stand in the industry. Shruti haasan is a very big answer. He says that he is the heroine of this film and that his father is not the character of Kamal support... not the mother's support.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs