Advertisement
Google Ads BL

'ఖైదీ..' కంటే 'బ్రహ్మోత్సవం' బెటర్..!


మెగాస్టార్‌ చిరంజీవికి వెండితెరపై తిరుగేలేదు. కానీ ఆయన రాజకీయాలోకి వెళ్లిన తర్వాత ఆయనకున్న క్రేజ్‌ తగ్గిందేమో అని అందరూ భావించారు. కానీ తన 150వ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తూ ఆయన చేసిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టిందని చెప్పారు. కానీ ఐటి రైడ్స్‌లో మాత్రం ఆ చిత్రం అంత కలెక్ట్‌ చేయలేదని ప్రచారం జరిగింది. ఇక చాలాకాలం తర్వాత చిరు రీఎంట్రీ మూవీ కాబట్టి ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఈ చిత్రాన్ని చూశారు. కానీ ఇదే మ్యాజిక్‌ను ఆయన మరలా తన తదుపరి చిత్రాల ద్వారా కూడా రిపీట్‌ చేయగలడా? అనేది సందేహాస్పదంగా మారింది. 

Advertisement
CJ Advs

ఇక ఆయన నాగార్జున స్థానంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి హోస్ట్‌గా చేశాడు. కానీ ఈ షో అసలు క్లిక్‌ కాలేదు. కానీ దీనికి మెగాభిమానులు ఇది పరీక్షల సీజన్‌ అంటూ.. ఏవేవో కుంటిసాకులు చెప్పారు. ఇక తాజాగా చిరు 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రాన్ని బుల్లితెరపై ప్రీమియర్‌షోగా వేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రంలోని 'అమ్మడు... లెట్స్‌డు కుమ్ముడు, రత్తాలు..రత్తాలు' సాంగ్స్‌ను ఈ ప్రీమియర్‌షోలో రెండుసార్లు రిపీట్‌ చేసి, డ్యాన్స్‌ల్లో చిరుకి ఉన్న క్రేజ్‌తో భారీ టీఆర్పీ రేటింగ్స్‌ను ఆశించారు. కానీ ఈ చిత్రానికి కేవలం 6.9 టీఆర్పీ రేటింగ్‌ మాత్రమే వచ్చింది. కనీసం రెండంకెలు కూడా నమోదు చేయలేకపోయింది. 

ముందుగా ఎంతో ప్రమోషన్‌ చేసినప్పటికీ ఈ చిత్రానికి అంత తక్కువ టీఆర్పీ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోపక్క మహేష్‌బాబు డిజాస్టర్‌మూవీ 'బ్రహ్మోత్సవం' కూడా తన ప్రీమియర్‌షోలో 'ఖైదీ' కంటే ఎక్కువగా 7.2 టీఆర్పీని సాధించడం గమనార్హం. అయినా కూడా మెగాభిమానులు చిరుకి వంత పాడుతున్నారు. 'ఖైదీ' ప్రీమియర్‌ షో వేసిన సమయంలోనే మరో చానెల్‌లో ఐఫా వేడుకలు ప్రసారం కావడమే చిరు సినిమా టీఆర్పీలు తగ్గడానికి కారణమని వితండవాదం చేస్తున్నారు...! 

Brahmotsavam TRP Better than Khaidi No 150:

Megastar Chiranjeevi Khaidi No 150 got only 6.9 TRP. Mahesh Babu Brahmotsavam to get 7.52 TRP. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs