బాలకృష్ణ - పూరి కాంబినేషనే ఒక సంచలనం. ఎవ్వరూ ఊహించని ఈ కాంబినేషన్ లో బాలయ్య 101 వ చిత్రం షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వారి కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో ఇంకా హాట్ టాపిక్ నడుస్తుంటే ఇప్పుడు పూరి, బాలకృష్ణ చిత్రానికి పెట్టిన టైటిల్ కూడా అంతే హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు బాలయ్య కొత్త చిత్రానికి 'ఉస్తాద్, జై బాలయ్య, తేడా సింగ్' అనే పేర్లు బాగా వినబడ్డాయి. ఇక పూరి కూడా ఇవే టైటిల్స్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో అందులో ఏదో ఒక టైటిల్ ఫైనల్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ బాగా వెయిట్ చేశారు.
ఇక జూన్ 10 బాలయ్య బాబు బర్త్ డే కానుకగా ఒకరోజు ముందే అంటే జూన్ 9 న బాలకృష్ణ - పూరీల టైటిల్ ఎనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. అసలు ఎటువంటి భారీ తనంగాని, కొత్తదనం గాని లేకుండా చాలా సాదా సీదాగా వున్న టైటిల్ ని బాలయ్య కోసం పూరి సెలెక్ట్ చేసాడు. 'పైసా వసూల్' అనే కామెడీ టైటిల్ పెట్టి బాలయ్య ఫ్యాన్స్ ని ఉసూరుమనిపించాడు పూరి. ఎప్పుడూ తనదైన స్టైల్స్ లో టైటిల్ తో ఆకట్టుకునే పూరి ఈసారి బాలకృష్ణ విషయంలో టైటిల్ పరంగా మాత్రం రాంగ్ స్టెప్ వేసాడనే కామెంట్స్ వినబడుతున్నాయి.
ఇక 'పైసా వసూల్' ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ కూడా ఏమంత కొత్తగా కనబడలేదని అంటున్నారు. ఇదివరకు బాలకృష్ణ ని చూసినట్టే ఉందని ఎటువంటి కొత్తదనం బాలయ్యలో లేదనే టాక్ వినబడుతుంది. మరి ఇలా 'పైసా వసూల్' టైటిల్ పెట్టడానికి కథకి ఏం లింక్ వుందో గాని ఈ టైటిల్ మాత్రం ఎవ్వరికి పెద్దగా ఎక్కడం లేదని అంటున్నారు. మరీ ఇంత కామెడీ టైటిల్ ఏమిటా అని అంటున్నారు. మరి బాక్స్ ఆఫీస్ ని దడదడలాడించే బాలయ్యబాబు ఇలా 'పైసా వసూల్' అంటూ ఏం చేస్తాడో ఏమో అంటున్నారు. ఇకపోతే బాలయ్య హీరోయిన్లు గా శ్రియ, ముస్కాన్, కైరా దత్తా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.