నాని 'అష్టాచమ్మా' దగ్గరనుండి ప్రతి సినిమాకి ఎంతో కొత్తగా కనిపిస్తూనే వున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేకపోయినా ఎంతో కష్టపడి నేచురల్ స్టార్ గా నాని ఎదిగిన తీరు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నాని నటించిన సినిమాలన్నీ వరసబెట్టి హిట్స్ అవడంతో ఇప్పుడు నాని రేంజ్ బాగా పెరిగిపోయింది. తాజాగా నాని చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'నిన్ను కోరి' చిత్రంలో నటిస్తున్న నాని పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ మళ్ళీ ప్రేక్షకులను పడెయ్యడానికి టీజర్ తో వచ్చేసాడు.
నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని, ఆది, నివేత థామస్ లు నటిస్తున్న 'నిన్ను కోరి' టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని టీజర్ ద్వారా అర్షమవుతుంది. నాని, నివేద థామస్, ఆది పినిశెట్టిలు ట్రావెల్ చేస్తున్నప్పుడు నాని 'ఈ అమ్మాయిలు అస్సలు అర్ధంకారు బాసు.... అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు... ఏ అలవాటులేనివాడిని పెళ్లి చేసుకుంటారు...' అంటూ పంచ్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి నాని మళ్ళీ 'నిన్ను కోరి' కథతో హిట్ కొట్టేలాగే వున్నాడు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ అందించింది గోపిసుందర్.