సుకుమార్ అంటే ప్రయోగాత్మక చిత్రాలకు, వైవిధ్యభరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇక ఇటీవల 'ధృవ' నుంచి రామ్‌చరణ్ కూడా విభిన్న చిత్రాలు, పాత్రలపై దృష్టి సారిస్తున్నాడు. ఇప్పటికే భారీ విజయాలను అందించిన మైత్రిమూవీమేకర్స్ కూడా వీరితో కలిసింది. దాంతో ఓ విభిన్న చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి 'రేపల్లె', 'పల్లెటూరి మొనగాడు', 'మెగల్తూరు మొనగాడు', 'రేపల్లెలో గోపాలుడు' వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ అందరూ నడిచే దారిలో తాను కూడా నడిస్తే ఏముంది ప్రయోజనం? ట్రెండ్‌ని ఫాలో కాకుండా ట్రెండ్‌ను సెట్ చేయడమే ముఖ్యమని ఈ చిత్రం యూనిట్ భావించింది. దాంతో ఎవ్వరూ ఊహించని విధంగా 'రంగస్థలం'అనే వెరైటీ టైటిల్‌ను సుక్కు-చరణ్ సినిమాకు డిసైడ్ చేశారు.
వాస్తవానికి 'రంగస్థలం' అంటే నాటకాలు, కళలను సూచించే పదం. ఇక 'రంగస్థలం' టైటిల్ కింద '1985'అని వేశారు. సో.. ఈ చిత్రం 1985కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తుందని తేలిపోయింది. ఇక ఈ చిత్రంలో రావు రమేష్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పాత్రలోకి ప్రకాష్‌రాజ్‌ను తీసుకుని మరలా రీషూట్ చేస్తున్నారు. దాంతో 'రంగస్థలం' విడుదల ఈ ఏడాది ఉండదని, వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని కూడా తేల్చేశారు. గత ఏడాది సంక్రాంతికి చిరు 'ఖైదీ నెంబర్ 150'తో వస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి కుమారుడు రామ్‌చరణ్ రానున్నాడు. అసలు ఈ టైటిల్‌ను అభిమానులే కాదు.. ఇండస్ట్రీ వారు కూడా ఊహించలేదు. ఇక ఈ చిత్రం టైటిల్‌తో సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువైంది.
ఇక ఈ టైటిల్‌ను మెగాభిమానులు సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నారు. కొందరు మాత్రం ఇది మరీ ఓల్డ్ టైటిల్‌గా ఉందంటున్నారు. కానీ ఆ విషయం సుక్కుకి తెలియదా? ఆయనో జీనియస్. కేవలం టైటిల్‌ను బట్టి స్టోరీలు చెప్పే నేటి కాలంలో ఎవ్వరికీ ఊహకందని, ఎవ్వరూ ఊహించలేని కథ, టైటిల్‌తో రావడం ఆయన నైజం. ఇక ఈ చిత్రం కథ అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. గ్రామీణ యువకుడైన చరణ్ చెవిటి వాడు. అతను పట్టణానికి వస్తాడు. ఆయనపై కొన్ని ప్రయోగాలు జరుగుతాయి. వాటి వల్ల ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగేది ఈ చిత్ర కథ అంటున్నారు. కానీ ఇది నిజం కాదని, సుక్కు చిత్రమంటే ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్‌తో పాటు సమంత, ప్రకాష్‌రాజ్‌లు క్యారెక్టర్లు, దేవిశ్రీ సంగీతం హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు.