Advertisement

పవన్‌, త్రివిక్రమ్ చిత్రానికి ఇన్ని ఆకర్షణలా!


ప్రస్తుతం పవన్‌ తన 25వ చిత్రంగా త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత పవన్‌ ఎయంరత్నం, నీసన్‌లతో ఓ చిత్రం, వినాయక్‌తో ఓ చిత్రం ఇలా ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ 2019 ఎన్నికల వేడి ఇప్పటికే రగలడంతో పవన్‌ ఎన్నికల ముందు చేసే చివరి చిత్రం ఇదేనన్న వాదన కూడాఉంది. ఇక పవన్‌ సినిమా అంటే అతనొక్కడే స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు..కోట్లు వచ్చిపడతాయి. అదే అతని చిత్రానికి మంచి కథ, పంచ్‌ డైలాగ్‌లు, ఇతర నటీనటులు తోడయితే ఆ రేంజ్‌ మామూలుగా ఉండదు. ఏమాత్రం బాగా లేని 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడు' చిత్రాలే ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్‌ తెచ్చుకున్నాయో అందరికి తెలిసిందే. 

Advertisement

'జల్సా, అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌తో చేస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఇక ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇక తన సినిమాలలో హీరోలకే కాక హీరోయిన్లు, ఇతర నటీనటులకు కూడా మంచి ప్రాధాన్యం ఉండేలా చూసుకోవడం త్రివిక్రమ్‌ స్టైల్‌. ఈ తాజా చిత్రంలో కూడా ఖుష్బూ పాత్రని 'అత్తారింటికిదారేది'లో నదియా పాత్ర కంటే పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట. దానికి తోడు నిన్నటితరం సెక్స్‌అప్పీల్‌ ఉన్న హీరోయిన్‌ ఇంద్రజకు కూడా ఇందులో మంచి పాత్ర ఉందట. కీర్తిసురేష్‌, అనుఇమ్మాన్యుయేల్‌లు ఎలానూ ఉన్నారు. ఇక ఈ చిత్రం కోసం పవన్‌ ఆఫీస్‌ సెట్‌ను 4.5కోట్లతో, పవన్‌ ఇంటి సెట్‌ను 3కోట్లతో, టెర్రస్‌ సెట్‌ని 2కోట్లతో ఇలా భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నారు. విదేశాలకు వెళ్లాలంటే ఆలస్యం అవుతుందని, ఇక దుబాయ్‌లో తీయాల్సివస్తే ఎండల వేడిమి తట్టుకోలేరనే ఉద్దేశ్యంతో ఒరిజినల్‌ లోకేషన్స్‌ బదులు భారీ సెట్స్‌ను రాధాకృష్ణ ఏమాత్రం కాంప్రమైజ్‌ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లకు కూడా మంచి ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. 

సాధారణంగా పవన్‌, త్రివిక్రమ్‌లంటే తమకథా బలం, తమ డైలాగ్‌లు, తమ ఇమేజ్‌తోనే సినిమాను ఒంటిచెత్తో మోస్తారేగానీ గ్రాఫిక్స్‌ వంటి వాటికి ఇప్పటివరకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మరి 'బాహుబలి' ఎఫెక్టో ఏమో వీరి గాలి కూడా గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ల వైపుకు మళ్లింది. ఈ చిత్రం దాదాపు 125కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. మొత్తానికి పవన్‌ తన 25వ చిత్రాన్ని తన కెరీర్‌లోనే మరచిపోలేని విధంగా ఉండాలని భావిస్తున్నాడట...! 

PK 25th Film Latest Updates:

So Many Attractions in Pawan Kalyan and Trivikram Srinivas Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement