Advertisement
Google Ads BL

అదే జరిగితే.. మాస్‌రాజాకు మడతఖాజానే!


ఏడాదికి ఎవ్వరితో సంబంధం లేకుండా రెండు చిత్రాలు చేయడం మాస్‌మహారాజాకు అలవాటు. కానీ సిక్స్‌ప్యాక్‌లు, బాడీబిల్డింగ్‌లు, బరువు తగ్గడానికి చేసిన పనుల పుణ్యమా అని అతనిలో ముందున్న గ్రేస్‌ పోయింది. దాంతో 'బెంగాల్‌టైగర్‌' తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఇక ఆ మధ్య వేణు శ్రీరామ్‌, దిల్‌రాజుల 'ఎవడో ఒకడు', విక్రమ్‌సిరి, చందుమొండేటి వంటి దర్శకులను ఏళ్లకు ఏళ్లు వెయిట్‌ చేయించాడు. చివరకు దిల్‌రాజు-వేణుశ్రీరామ్‌ల దర్శకత్వంలోనే రాజా దిగ్రేట్‌, కొత్త దర్శకుడు విక్రమ్‌ సిరి దర్శకత్వంలో టచ్‌ చేసి చూడు చిత్రాలు ఒప్పుకుని రెండింటిని సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక దిల్‌రాజు 'రాజా దిగ్రేట్‌' విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలి? ఎప్పుడు రిలీజ్‌ చేస్తే వర్కౌట్‌ అవుతుంది? అనే విషయాలు రాజుకి తెలుసు. కానీ కొత్త దర్శకుడు విక్రమ్‌సిరితో రవితేజ చేస్తున్న 'టచ్‌ చేసి చూడు' షూటింగ్‌ సగం పూర్తయిందని, కాబట్టి ఎలాగైనా ఈ చిత్రాన్ని దసరా రేసులో దించాలని భావిస్తున్నారు. బహుశా సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 

కానీ ఈసారి దసరాకు పెద్ద పెద్ద హీరోలు సీట్లు రిజర్వ్‌ చేసుకుంటున్నారు. బాలయ్య-పూరీల చిత్రం సెప్టెంబర్‌29న విడుదల కానుంది. ఎన్టీఆర్‌-బాబిల చిత్రం సెప్టెంబర్‌1న 'జనతాగ్యారేజ్‌' రోజే విడుదల కానుంది. ఇక మహేష్‌ 'స్పైడర్‌', పవన్‌-త్రివిక్రమ్‌ వంటి వారందరూ దసరాపైనే దృష్టి పెట్టారు. చరణ్‌-సుక్కు చిత్రం కూడా సెప్టెంబర్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వీరందరి మధ్యలో చాలా గ్యాప్‌ తర్వాత మాస్‌మహారాజా వస్తే మడత ఖాజానే అంటున్నారు. 

Raviteja Movie in September Race:

After a big Gap, Raviteja Fights with Big Movies and Big Heroes in September.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs