Advertisement
Google Ads BL

హెబ్బా ని పబ్లిసిటీ కోసమే అలా వాడుతున్నారా?


హెబ్బాపటేల్‌.. నేడు గోల్డెన్‌లెగ్‌గా చెప్పుకుంటున్న చిన్న హీరోల, చిన్న చిత్రాల దర్శకుల, నిర్మాతల ఫస్ట్‌చాయిస్‌. కాగా ఈమె వరుసగా 'కుమారి21 ఎఫ్‌' తర్వాత కుర్రహీరో రాజ్‌తరుణ్‌ సరసన నటించింది. ఇక 'అంధగాడు' సమయంలో రాజ్‌తరుణ్‌కు, ఈ అమ్మడికి మద్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ చిత్రం రిలీజ్‌ సమయంలో ఓ ఇంటర్వ్యూలో హెబ్బాపటేల్‌ మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేము కేవలం ఫ్రెండ్స్‌మి మాత్రమే. ఇక రాజ్‌తరుణ్‌తో వరుసగా నటించి, నటించి బోర్‌ కొట్టింది. కాబట్టి ఇంక కొంతకాలం ఆయనతో కలిసి నటించను అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 

Advertisement
CJ Advs

దీంతో రాజ్‌తరుణ్‌కి, హెబ్బాపటేల్‌కి మధ్య గ్యాప్‌ వచ్చిందని, అందుకే ఆమె అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇస్తోందని మరలా వార్తలు వచ్చాయి. అయినా ఓ చిత్రంలో ఎవరితోనైనా నటించేప్పుడు వారిద్దరూ క్లోజ్‌గా ఉంటే వారి మధ్య ఏదో ఉందని వార్తలు రావడం సహజం. ఇక సోషల్‌ మీడియాలో అయితే చెపాల్సిన పనిలేదు. తాజాగా హెబ్బాపటేల్‌.. రాజ్‌తరుణ్‌ని వదలి మరో బిగ్‌షాట్‌ కుమారుడిని లైన్‌లో పెట్టిందనే వార్తలు మొదలయ్యాయి. 

ప్రస్తుతం ఆమె యువ హీరో నాగ అన్వేష్‌తో కలిసి 'ఏంజెల్‌' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమెదే లీడ్‌రోల్‌. ఈ నాగ అన్వేష్‌ మరెవరో కాదు.. సింధూర పువ్వు కృష్ణారెడ్డి కుమారుడు. మరి వీరిద్దరి మద్య నిజంగా డేటింగ్‌ జరుగుతోందో లేదో తెలియదు గానీ ఈ వార్తలను ఆ యూనిట్‌ సభ్యులే లీక్‌ చేస్తూ, సినిమాకు పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి నిర్మాతల వలలో మీడియా పడిపోయిందా? సినిమా పబ్లిసిటీకి ఇది ప్లస్‌ అవుతుందా? వంటివి ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Rumors on Hebah Patel:

After Hebah Patel and Raj Tarun, Gossips Raised on Hebah Patel and Naga Anvesh. But This is the Publicity Stunt. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs