ఎన్నికల్లో దొంగ ఓట్లు, పరీక్షలలో మాస్ కాపీయింగ్‌లాగానే నేడు సినిమా ఫీల్డ్‌లో ఇన్నికోట్ల వ్యూస్, ఇన్ని కోట్ల కలెక్షన్లు అంటూ ట్రెండ్ మొదలైంది. కలెక్షన్లలో, వ్యూస్‌లో కూడా మాల్‌ప్రాక్టీసు జరుగుతుందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు 50రోజుల కేంద్రాలు, 100రోజల కేంద్రాల విషయంలో ఎంత రచ్చ జరిగిందో నేడు సోషల్‌మీడియాలో వ్యూస్ విషయంలో అలాగే జరుగుతున్నాయనే వాదన ఉంది.
కానీ అవ్వన్నీ పక్కనపెడితే అసలైన విషయాలు బయటపడేవరకు నిర్మాతలు అఫీషియల్‌గా చెప్పిన విషయాలనే మనం నిజమని భావించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం ట్రైలర్ కూడా ఓ ఊపు ఊపుతోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24గంటలోనే 7.4 మిలియన్‌వ్యూస్‌ని సాధించింది. 46గంటలో 10మిలియన్ వ్యూస్ (కోటి) సాధించిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అల్లుఅర్జున్‌కి సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగే దీనికి కారణమని అంటున్నారు. దీంతో అల్లుఅర్జున్.. కింగ్ ఆఫ్ సోషల్‌మీడియా..అని నిర్మాతలు ఓ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. సోషల్‌మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చూసి యూనిట్ ఎంతో ఆనందంతో ఉంది.
ఇక ఈ చిత్రాన్ని మంచి ఊపుతో గ్రాండ్‌స్కేల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు'తో మంచి ఊపు మీదున్న బన్నీ.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బన్నీ కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేయడం ఖాయమంటున్నారు. బన్నీకి తోడు దిల్‌రాజు, 'గబ్బర్‌సింగ్' హరీష్‌శంకర్, దేవిశ్రీప్రసాద్‌లు ఉండటంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వస్తోంది.