చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అని చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చాడు. ఉయ్యాలవాడ చిత్రాన్ని తెరకెక్కించడానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా రెడీగా వున్నాడు. ఇక పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్ట్ వర్క్ ని దాదాపు పూర్తి కూడా చేసేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడమే ఇక మిగిలింది. అలాగే చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి బ్రేక్ ఇచ్చేసి కొంత విరామం తర్వాత 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' ప్రాజెక్ట్ కోసం పూర్తిగా సిద్ధమవుతాడని అన్నారు.
అయితే సడన్ గా ఉయ్యాలవాడ చిత్రం ఇప్పట్లో తెరకెక్కదని..... కారణం ఉయ్యాలవాడ చరిత్రను కూలంకషంగా తెలుసుకోవడం, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు చేయాలనీ.... తన డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి, దానికోసం కాస్త ఎక్కువ టైం పెట్టె అవకాశం ఉన్నట్టు మెగాస్టార్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్, చిరు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
అందుకే చిరు తన 151 వ సినిమాగా ఒక కమర్షియల్ సినిమాని చెయ్యాలని భావిస్తున్నాడట. ఇక మాస్ సినిమాలకు పేరున్న డైరెక్టర్ బోయపాటితో తన 151 వ చిత్రాన్ని చిరు చేయబోతున్నాడనే కొత్త న్యూస్ వెలుగులోకొచ్చింది. బోయపాటి ప్రస్తుతం చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పూర్తవ్వగానే మెగాస్టార్ సినిమా పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే వచ్చే ఏడాదే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని సెట్స్ మీదకి తీసుకెళతారని అంటున్నారు.