Advertisement
Google Ads BL

పవన్ సినిమాలో మరో సీనియర్ నటి..!


గతంలో హీరోయిన్ గా చేసిన ఇంద్రజ ఇప్పుడు..... కొన్ని సినిమాల్లో అమ్మ పాత్రల్లో మెరుస్తుంది. ఇక ఇప్పుడు కూడా ఇంద్రజకు స్టార్ హీరో సినిమాలో ఒక మంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తుండగా... సీనియర్ నటి ఖుష్బూ కూడా ఒక కీలక పాత్ర అంటే సవతి తల్లి పాత్రలో నటిస్తుందని సమాచారం. అయితే ఇప్పుడు ఇంద్రజని కూడా ఒక ముఖ్యపాత్రకి ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తండ్రి మరణంపై పగ తీర్చుకునే కథలో రెండు మూడు కీలక పాత్రలు ఉన్నాయట. ఇక సవతి తల్లి ఖుష్బూతో కలిసి కొడుకు విలన్స్ పై పగతీర్చుకుంటాడట. అయితే ఇదే కథలో ఇంకో ముఖ్యపాత్ర కూడా ఉంటుందట. ఇక ఆ ముఖ్యపాత్రకి ఇంద్రజని తీసుకుంటున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ టీమ్ ఇంద్రజతో సంప్రదింపులు జరిపారని టాక్.

మరి ఇంద్రజ ఈ ప్రపోజల్ కి ఒప్పుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఎలాంటి ఛాన్స్ వచ్చినా వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. మరి ఇంద్రజ నిర్ణయం ఎలా వుందో త్వరలోనే తెలుస్తుంది.  

Indraja in Pawan and Trivikram Film:

After Kushboo, another Senior actress Indraja got chance in Pawan Kalyan and Trivikram Srinivas Film. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs