Advertisement
Google Ads BL

బన్నీ తో ఛాన్సే..బాగా డిమాండ్ పెంచేసింది..!


'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రంలో 'బడిలో ఒడిలో' అంటూ అందాల ఆరబోతతో పూజ హెగ్డే హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ లో 'ముకుందా'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ  నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' లో చేసి నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది కానీ సూపర్ హిట్ సాధించలేకపోయింది. ఇక 'మోహింజదారో' చిత్రంతో బాలీవుడ్ లో పాతుకుపోదామని ప్లాన్ చేసి ఘోరంగా దెబ్బతినడంతో మళ్లీ  సౌత్ కొచ్చి పడింది. ఇక్కడ అల్లు అర్జున్ కి జోడిగా మోడరన్ గర్ల్ గా గ్లామర్ షోకి తెర తీసింది. ఇక ఇప్పుడు పూజ హెగ్డే డిమాండ్ బాగా పెరిగిందనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

అయితే బెల్లంకొండ సంస్థానంలో హీరోయిన్స్ కి ఎలాంటి డిమాండ్ ఉంటుందో శ్రీనివాస్ మొదటి చిత్రం దగ్గర నుండి చూస్తూనే వున్నాం. ఇప్పుడు పూజ హెగ్డే కూడా కళ్ళు చెదిరే ఆఫర్ తో బెల్లంకొండ సంస్థానంలోకి పూజ అడుగుపెట్టబోతుందని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రం 'అల్లుడు శీను' దగ్గర నుండి బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ని భారీ పారితోషకాన్ని ఆఫర్ చేసి తన కొడుకు పక్కన నటింపజేస్తున్నాడు. ఇప్పుడు కూడా తాజాగా  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో ఓ సినిమా ప్రారంభమైనది.

ఈ చిత్రంలో శ్రీనివాస్ కి జోడిగా పూజ హెగ్డేని సంప్రదించగా... ఆమె ఒక కోటి రూపాయలతో సహా దానికి సర్వీస్ టాక్స్ కూడా అడిగినట్లు వార్తలొస్తున్నాయి. పూజతో చర్చలు జరుపుతున్నారని... ఇంకా ఈ చిత్రానికి పూజని ఫిక్స్ అయితే చెయ్యలేదని అంటున్నారు. మరోపక్క కోటి రూపాయల రెమ్యునరేషన్ కి పూజ, శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా సెట్ అయ్యిందనే వార్తలొస్తున్నాయి.

Pooja Hegde Dimands 1 Crore for Sreevas Film:

Pooja Hegde Takes 1 Crore Rupees For Bellamkonda Srinivas and Director Sreevas Film. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs