Advertisement
Google Ads BL

చరణ్‌లో మెచ్యూరిటీ వచ్చింది...!


వాస్తవానికి మెగా కాంపౌండ్‌లో పవన్‌, నాగబాబులు కాస్త సూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు గానీ.. చిరంజీవి, అల్లుఅరవింద్‌, బన్నీ నుంచి తేజు వరకు అందరూ లౌక్యంగా మసలుకునే వారు. కానీ ఆమధ్య కొన్నిసార్లు మీడియాను వెంట్రుకతో పోల్చడంతో పాటు తెలుగు దర్శకులను చులకన చేస్తూ ఓ తమిళ అనువాద ఆడియో వేడుకలో చరణ్‌ వ్యాఖ్యలు చేయడం, దానికోసమేనా అన్నట్లు బాలకృష్ణ, స్వర్గీయ దాసరి వంటి వారు మండిపడటం జరిగింది. దీంతో మరోసారి మెగా కాంపౌండ్‌కు, దాసరి వర్గానికి కోల్డ్‌వార్‌ అని పలు మీడియాలలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా రామ్‌చరణ్‌ తన మెచ్యూరిటీని చూపిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

తాజాగా జరిగిన 'కాదల్‌' వేడుకలో ఆయన మైకు అందుకోగానే దాసరిగారు మరణించిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్‌ ఇదేనంటూ ఓ నిమిషం మౌనం పాటించాలని సూచించి, మౌనం పాటించాడు. 'వుయ్‌ మిస్‌ యు సార్‌' అంటూ ఉద్వేగంగా చెప్పాడు. ఇక అదే వేడుకకు వచ్చిన తెలంగాణ ఐటి మంత్రి, కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు. మొత్తం మీద చరణ్‌లో కూడా బాగానే మెచ్యూరిటీ లెవల్స్‌ పెరుగుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Ram Charan Speech at Kaadhali Audio Launch:

Mega Power Star Ram Charan Praises Dasari Narayana Rao and Telangana Minister KTR at Kaadhali Audio Launch. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs