Advertisement
Google Ads BL

బుల్లెట్‌ కు అడ్డు వచ్చేలా వున్నాడు..!


నిర్మాత సి.కళ్యాణ్‌.. ఆయన పూర్తి పేరు చిల్లర కళ్యాణ్‌. పేరుకు తగ్గట్టుగానే ఆయన చేసేవన్నీ చిల్లర పనులే. ఇక ఈమద్య ఆయన కుమారుడు కూడా చిల్లర దొంగతనాలు చేసి బుక్కైపోయాడు. ఇక నిర్మాతగా సి.కళ్యాణ్‌పై ఎప్పటినుంచో పలు వివాదాలున్నాయి. 'ఖలేజా' టైటిల్‌ను ముందుగా రిజిష్టర్‌ చేసిన దర్శకనిర్మాతలను బెదిరించి, అదే టైటిల్‌ను మహేష్‌ చిత్రానికి ఖరారు చేయడం, దాంతో చిత్ర నిర్మాతలు పెద్ద గొడవ చేయడంతో ఎట్టకేలకు ఈ చిత్రానికి 'మహేష్‌ ఖలేజా' అనే పేరు పెట్టారు. ఇక మాఫియాను పెంచి పోషిస్తాడని, భానుతో పాటు మొద్దుశ్రీనువంటి వారితో మద్యస్థాలు చేస్తుంటాడని ఆయనపై అనేక వార్తలున్నాయి. కానీ అదేమి చిత్రమో ఆయనను ఇండస్ట్రీలోని ఇతరులు పల్లెత్తు మాట అనరు. పైగా ఆయన ఇండస్ట్రీలో ఒకానొక పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే భగవాన్‌, పుల్లారావులు స్టార్ట్‌ చేసిన గోపీచంద్‌-నయనతారల 'ఆరడుగుల బుల్లెట్‌' చిత్రం చివరకు జయబాలాజీ పతాకంపై తాండ్రరమేష్‌, సి.కళ్యాణ్‌లు టేకోవర్‌ చేశారు. ఈ చిత్రాన్ని జులై9న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలాకాలం తర్వాత యాక్షన్‌ హీరో గోపీచంద్‌ నటించిన చిత్రాన్ని, అందునా బి.గోపాల్‌ వంటి పక్కా మాస్‌ డైరెక్టర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు పెరిగాయి. అందునా సౌత్‌ఇండియన్‌ టాప్‌ హీరోయిన్‌ నయనతార ఇందులో నటిస్తుండటం మరింత విశేషంగా మారింది. ఇంకేముంది మరో రెండురోజుల్లో ఈ చిత్రాన్ని చూస్తామని, గోపీచంద్‌, బి.గోపాల్‌, నయనతార అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

మూడు నాలుగేళ్లుగా ఆలస్యమైన చిత్రం ఇప్పటికైనా బయటకు వస్తున్నందుకు ఆనందపడ్డారు. కానీ సహదేవ్‌ అనే ఎన్నారై ఈ చిత్రం కోసం సి.కళ్యాణ్‌ తన వద్ద 6కోట్ల రూపాయలు తీసుకున్నాడని, ఆ డబ్బు తనకు తిరిగి ఇచ్చేంత వరకు ఈ 'ఆరడుగుల బుల్లెట్‌' విడుదలను ఆపివేయాలని సిసిఎస్‌లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తానికి సి.కళ్యాణ్‌ తప్పు పుణ్యమా అని గోపీ అభిమానులలో ఈ చిత్రం అనుకున్న విధంగా రిలీజ్‌ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. 

Aaradugula Bullet in Release Troubles:

Gopichand and Nayanthara movie Aaradugula Bullet Movie in Release Problem, The Reason behind this Problem is Producer C Kalyan.  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs