Advertisement
Google Ads BL

మేఘ ఆకాష్ టాలీవుడ్ లక్కీ గర్ల్..!


టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు ఇంకా విడుదల కానేలేదు. కానీ ఆ హీరోయిన్ కి మాత్రం భీభత్సమైన డిమాండ్ ఏర్పడిపోయింది. టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ లా మారిన మేఘ ఆకాష్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మొదట్లో కోలీవుడ్ లో గౌతమ్ మీనన్ - ధనుష్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న మేఘ ఆకాష్ పైనే ఇప్పుడందరి చూపు. ఇప్పుడు ఇక్కడ నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నితిన్ - హను రాఘవపూడి  కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'లై' చిత్రంలో హీరోయిన్ గా సెట్ అవ్వడమే కాక... రామ్ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఛాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. 

Advertisement
CJ Advs

రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఈ మధ్యనే ఒక చిత్రం ప్రారంభమైంది. ఆ చిత్రంలో కూడా హీరోయిన్ గా అవకాశం అందిపుచ్చుకుని అదృష్టం అంటే తనదే అనేలా చేసింది మేఘ. ఒకేసారి ఇద్దరు కుర్ర హీరోలతో జోడి కడుతున్న ఈ మేఘ ఆకాష్ కి ఇప్పుడు మరో అవకాశం తలుపుతట్టినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ నిర్మాణ సారధ్యంలో నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం చేస్తున్న కొత్త చిత్రం ఇప్పుడు పట్టాలెక్కబోతుంది. ఆ చిత్రంలో నితిన్ కి జోడిగా మేఘ ఆకాష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఒకేసారి ఒకే హీరోతో రెండు సినిమాల్లో నటిస్తూనే మరో యువ హీరోతో జోడి కడుతున్న ఈ భామకు అదృష్టం ఏ రేంజ్ లో ఉందొ చూశారూ.. ఇక నితిన్ కొత్త చిత్రం ఈ నెల 28  నుండి మొదలుకాబోతుంది. అయితే నితిన్ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్ అనే విషయం చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.  

Heroine Megha Akash is Lucky Girl in Tollywood:

She her films in Tollywood are not yet released. But the heroine's demand for fear was getting worse. Megha Akash is a sensation actress in Tollywood and is now the most wanted heroine. Pawan Kalyan - Trivikram is the new film directed by Krishna Chaitanya in Nithiin's hero. In the film, Nithiin is reported to be the heroine of Megha Akash as the heroine.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs