Advertisement
Google Ads BL

ఈ వయసులో కూడా ఇరగదీశాడంటున్న శ్రియ!


బాలకృష్ణ - శ్రియ శరణ్ జంటగా పూరి జగన్నాధ్ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుపుకుంటుంది. కొన్ని యాక్షన్ సీన్స్, మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. పోర్చుగల్‌లో భారీ ఎత్తున చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఒక ఆసక్తికర విషయాన్ని పోస్ట్ చేసింది హీరోయిన్ శ్రియ శరణ్.

Advertisement
CJ Advs

పోర్చుగ‌ల్ రాజ‌ధాని లిస్బన్‌లో ఆదివారం ఓ ఛేజ్ సీన్‌ను నటీనటులపై  తెరకెక్కించడానికి పూరి ప్లాన్ చేసాడట. అందులో భాగంగా కార్ ని  డ్రిఫ్టింగ్ ప‌ద్ధతిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ని ఎటువంటి డూప్ లేకుండా బాలకృష్ణ చేసి చూపించాడట.  అసాధార‌ణ‌మైన ఆ షాట్‌ను డూప్‌తో ప‌నిలేకుండా బాల‌కృష్ణ అవ‌లీల‌గా చేసిన తీరు యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అదే కారులో బాలకృష్ణ పక్కన ఉన్న హీరోయిన్ శ్రియ, బాలకృష్ణ డూప్ లేకుండా చేసిన సన్నివేశాన్ని చూసి కొన్ని నిమిషాలపాటు షాక్ లో ఉండిపోయింది.

ఇంత వయసులోనూ బాలకృష్ణ ఎంతో ఎనెర్జీతో ఇలాంటి రిస్కీ షాట్స్ ను చేయడం చూసి ఆయనకు సినిమాల మీద ఉన్న కమిట్మెంట్ కు ఆశ్చర్యపోయింది. ఇదే విషయాన్ని శ్రియ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక బాలయ్య - పూరి కాంబోలో తెరకెక్కే ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఈ నెల 9  న విడుదల చెయ్యనున్నారు.

Balakrishna's Action Sequence without Dupe!:

Balakrishna spun the car in 360 degrees in the action scene through drifting method. Heroine Shriya who sat next to Balayya was shocked to see the extraordinary feat of his. Balakrishna has reportedly done the shot twice. Amazed by his feat, all unit members put their hands together in a token of appreciation.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs