2018 నేషనల్ గేమ్స్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆశగాఎదురుచూసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలోని రాజకీయ నాయకులు, వారి వ్యవహారశైలి వల్ల ఏపీ అ అవకాశాన్ని పొగొట్టుకుంది. ఏపీఓఎలో ఉన్న ఇద్దరు ఎంపీలైన సీఎం రమేష్, మహేష్‌బాబు బావ గల్లాజయదేవ్‌ల రాజకీయ ఎత్తుగడల వల్ల ఈ అవకాశం ఏపీకి రాకపోవడంతో చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడు.
ఈ నేపధ్యంలో స్పోర్ట్ అసోసియేషన్ నుంచి రాజకీయ నాయకులు తమ ప్రాతినిద్యం నుంచి తప్పుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా సీఎం రమేష్, గల్లా జయదేవ్ గ్రూపుల వల్ల ఇలా జరగడం బాబుకు కోపాన్ని తెచ్చింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్ గ్రూప్ తప్పుకోగా, గల్లా జయదేవ్ గ్రూప్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గల్లా గ్రూప్‌ను గుర్తించింది. కానీ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాత్రం ఈ రెండు గ్రూపులను గుర్తించడానికి నిరాకరించడం, తదితర పరిణామాల వల్ల ఎంతో ప్రతిష్టాత్మకమైన భారత జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, తాను సీఎంగా ఉన్న హయాంలోనే ఈ ఘనతను సాధించాలని చూసిన బాబు ఆశలు నిరాశలవ్వడం విశేషం.