అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా చేస్తున్న 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా... హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ తో దుమ్ముదులుపుతుంటే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో అలరించడానికి వచ్చేసాడు. మరి అల్లు అర్జున్, పూజ హెగ్డే తో కలిసి 'డీజే' ట్రైలర్ లో ఎలాంటి రచ్చ చేస్తున్నాడో మీరే చూడండి.
'డీజే' లో బ్రాహ్మణుడిగా నటిస్తున్న అల్లు అర్జున్ బ్రాహ్మణ లుక్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి... తనికెళ్ళ భరణితో 'ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ... సభ్యసమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్టూ...' అనే డైలాగ్ వుంది చూడండి అబ్బో అల్లు అర్జున్ అచ్చమైన బ్రాహ్మణుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి ఆకట్టుకున్నాడు. మరో పక్క స్టైలిష్ లుక్ లో అదరగొట్టే అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్ లో కూడా ఇరగదీశాడు. అలాగే హీరోయిన్ పూజ హెగ్డే కూడా మోడ్రెన్ లుక్ లో అదరగొడుతూనే... అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. ఇక బ్రాహ్మణుడిగా మోడ్రెన్ గర్ల్ పూజ లవ్ లో పడిన అల్లు అర్జున్ పూజ ని హగ్ చేసుకుని గట్టిగా చుంబిస్తూ...'పైగా నాది మాములు లవ్వా.. లవ్వాహా... లవ్వస్య....లవ్వోభ్యహా..' అంటూ వణికిపోతూ చెప్పే డైలాగే కాకుండా 'మనం చేసే పనిలో మంచి కనబడాలి.. కానీ మనిషి కనబడక్కర్లేదు' అంటూ చెప్పే డైలాగ్ 'డీజే' కె హైలెట్ గా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే అల్లు అర్జున్ మోడ్రెన్ లుక్ ని పరిచయం చేసిన డైరెక్టర్ హరీష్... బన్నీతో బరువైన డైలాగ్సే పలికించాడు. 'పబ్బుల్లో వాయించే డీజే కాదురా.... పగిలిపోయేలా వాయించే డీజే' ని అంటూ యాక్షన్ సీన్స్ తో చంపేశాడు. అంతేకాకుండా విలన్ గా రావు రమేష్ చేసే విలనిజాన్ని హైలెట్ చేస్తూ 'మేము మీలాగా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు.... పెద్ద బాలశిక్ష చదువుకున్నాం' అంటూ చెప్పే డైలాగ్... అల్లు అర్జున్ ఎమోషన్ సీన్స్ తో నిండిన ఈ ట్రైలర్ లో ఇంకా 'ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్... యుద్ధం శరణం గచ్ఛామి అనాలి' అంటూనే.... 'నేను వాడిని చూసిన రోజునే చంపక పొతే నా పేరు దువ్వాడ జగన్నాధమే కాదు... నేను శ్రీవత్సస గోత్రంలోనే పుట్టలేదూ...' అంటూ అటు బ్రాహ్మణుడిగా... ఇటు మోడ్రెన్ లుక్ లోను అల్లు అర్జున్ దంచేసాడు. ఇక ఆఖరిగా.... జూన్ 23 న వస్తున్నా.... అంటూ ట్రైలర్ కి ఎండ్ కార్డు వేసాడు.
మరి 'డీజే' లో చేస్తున్న పాత్రలన్నీ బరువైన పాత్రలే కావడం ఈ చిత్రానికి ప్లస్ అనే చెప్పాలి, అల్లు అర్జున్ మొదటిసారి బ్రాహ్మణ గెటప్, అదే ఎనేర్జి లెవల్స్ లో అదిరిపోయే పెరఫార్మెన్స్, పూజ ఆరబోసే అందచందాలు, పవర్ ఫుల్ విలన్ గా రావు రమేష్ ... మ్యూజిక్ తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్, విజువల్ గా కూడా 'డీజే' హై స్టాండర్డ్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి యాక్షన్, ఎమోషన్, ప్రేమ, కలగలిపిన 'డీజే' ట్రైలర్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో.... కొద్దీ గంటల్లో తెలిసిపోతుంది. ఇక ట్రైలరే ఇలా ఇరగదీస్తుంటే... సినిమాలో ఎంత దమ్ముందో తెలియాలంటే అల్లు అర్జున్ చెప్పినట్టు జూన్ 23 వరకు వైట్ చెయ్యాల్సిందే.