Advertisement
Google Ads BL

కారు నడిపితే రిస్కీ షాటేనా..?


నందమూరి బాలకృష్ణ డూప్‌ సహాయం లేకుండా రిస్కీ షాట్‌ చేశారంటూ చిత్ర యూనిట్‌ అత్యుత్సాహంగా ప్రకటించింది. ఐదు పదుల వయస్సు దాటిన బాలయ్య చేసిన రిస్క్‌ ఏమిటాని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. తీరా వార్త చదివితే కారుని డ్రిప్టింగ్‌ పద్దతిన 360 డిగ్రీలు తిప్పే షాట్‌ చేశారట. నిజానికి ఇప్పటి సినిమాల్లో కనిపిస్తున్న అనేక రిస్కీ షాట్స్‌తో పోలిస్తే ఇది చాలా తేలికైనది. కారు డ్రైవింగ్‌ పట్ల మక్కువ ఉన్నవారెవరైనా సరే ఈజీగా చేస్తారు. వయసు పైబడిన వారైతే హడావుడి ఎందుకంటూ డూప్‌ సహాయం తీసుకుంటారు. 

Advertisement
CJ Advs

ఇక బాలయ్య కారు ఎంత వేగంగా నడుపుతారో కొద్ది మందికే తెలుసు. ఆయన ఇరుకైన వీధుల్లో కూడా వంద కిలోమీటర్ల వేగంతో డ్రైవ్‌ చేస్తారని సన్నిహితులకు తెలుసు. ఇక ప్రధాన రోడ్లపై అయితే ఆయన వేగానికి లిమిట్‌ ఉండదు. డ్రైవింగ్‌లో ఇంతటి అనుభవం ఉంది కాబట్టే డ్రిప్టింగ్‌ షాట్‌ అవలీలగా చేశారు. దీన్ని సినిమా ప్రచారం కోసం వాడుకోవడమే విచిత్రం.

Balakrishna is Doing Risky shot on Car!:

Nandamuri Balakrishna duped the film unit's excitement to do a risk shot without help. The car is shot at 360 degrees of drops in the drawing mode. In fact, it is relatively easy compared to many of the risky shots in the movies.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs