Advertisement
Google Ads BL

పవన్ ఫస్ట్ లుక్ డేట్స్ ని లాక్ చేసేశారట..!

pawan kalyan,director trivikram srinivas,keerthy suresh,anu emmanuel,first look date locked | పవన్ ఫస్ట్ లుక్ డేట్స్ ని లాక్ చేసేశారట..!

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం సెట్స్ మీదున్నది. వీరిద్దరి కాబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇక ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రంపై కూడాబోలెడన్ని అంచనాలున్నాయి. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తున్నారు. ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నది.

Advertisement
CJ Advs

ఈ చిత్రం షూటింగ్ యమా స్పీడుగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షడ్యూల్ షూటింగ్ ని కూడా మొదలుపెట్టేసుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఒక ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే పవన్ - త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ డేట్ మరియు సినిమా రిలీజ్ డేట్స్ ని లాక్ చేసేశారట. తొందరలోనే ఆ డేట్స్ ని చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Pawan Kalyan First Look Coming Soon!:

Pawan Kalyan - Trivikram combination is on the third film sets. The bigger hits of these 'Jalsa, Attarintiki Dared' pictures are available in the Cabinet. Now there are predictions about the screening of the film. Pawan-Trivikram's movie First Look Date and Movie Release Dates locked.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs