ఏపీలోని విజ్ఞత ఉన్న ప్రతి పౌరుడు తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని చూసి మురిసిపోయారు. వారి లాంటి శక్తి, యుక్తి, సంకల్పం మనకు, మన నాయకులకు ఎందుకు లేవా? అని బాధపడ్డారు. నేడు కూడా ఏపీలో కేటీఆర్‌కు మంచి ప్రజాకర్షణ శక్తి ఉంది. కానీ నాటి కాంగ్రెస్ పాలకులు ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారు. విభజన హామీలకు, ప్రత్యేకహోదాలకు చట్టబద్దత ఇవ్వకుండా నాటకాలాడారు.
వార్‌రూంలో నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేశారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మర్చిపోయారు. ఇక ఏపీ ప్రజలు కూడా మామూలు గొర్రెలే కదా...!మహా అయితే ఓ ఏడాది బాధపడతారు. కోపగించుకుంటారు. ఆ తర్వాత అన్ని మరిచి మరలా తమకు ఓట్లేస్తారని కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్థానిక నాయకుల వరకు భావిస్తున్నారు. నేడు ప్రత్యేకహోదా భరోసా సభకు రాహుల్‌గాంధీని పిలిచారు. దానికి బాబు ఒకటే డిమాండ్ చేశాడు. సభలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది. కానీ అడ్డదిడ్డంగా ఏపీని నాశనం చేసిన రాహుల్ వంటి వారు ముందుగా తమ తొందరపాటుకు క్షమాపణలు చెప్పి మాత్రమే ఏపీలోకి రావాలి అన్నాడు.
సిగ్గుమాలిన జన్మలు... శవాలపై మరమరాలు ఏరుకునే గాంధీ దొంగ వారసులను ఏమన్నా తప్పులేదనే చెప్పాలి. ఇక ఈ సభకు పవన్ మద్దతు తెలిపాడు. దీనికి పవన్‌ని కూడా పిలిచినప్పటికీ పలు బిజీ కారణాల వల్ల రాలేకపోతున్నానని పవన్ అంటున్నాడు. రఘువీరారెడ్డికి శుభాకాంక్షలు తెలిపాడు. అంతవరకు బాగానే ఉంది కానీ విడదీసిన కాంగ్రెస్‌ను కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అన్న నోటితో విడదీసిన కాంగ్రెస్సే మరలా మొసలికన్నీరు కారుస్తుంటే చూసి జాలి పడాలా? పవన్ కూడా 'రాజకీయాలు' చేస్తున్నాడా? ఒక్క ప్రత్యేకహోదా విషయంలో ఏపీని బాధపెట్టడం మినహా మోదీ చేస్తున్న ప్రతి పని, ప్రతి నిర్ణయం కాంగ్రెస్ నాయకుల కంటే దీరోదాత్తంగా, దైర్యంగా, విమర్శలకు వెరవకుండా ఉన్న సంగతిని పవన్ గ్రహించాల్సిన సమయం వచ్చింది.