Advertisement
Google Ads BL

ఆ రోల్ దేవసేనని వరించిందా..?


'అరుంధతి' చిత్రంతో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది అనుష్క శెట్టి. అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తూనే ఇటు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో జోడి కడుతూ సక్సెస్ సాధించింది స్వీటీ. ఇప్పుడు తాజాగా 'బాహుబలి' చిత్రంలో దేవసేన గా కత్తి యుద్దాలు,వీలు విద్యలు , గుర్రపు స్వారీలు నేర్చుకుని అందరిని ఆకట్టుకుంది. చాలాకాలం వరకు అనుష్కని అందరూ దేవసేనగానే అభివర్ణిస్తారు.... అంతలా ఆ పాత్రకి 100  శాతం న్యాయం చేసింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ అనుష్క ఇప్పుడు 'భాగమతి' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే సెట్సమీదకెళ్ళిన ఈ చిత్రంలో అనుష్క చాలా స్లిమ్ గా కనబడుతున్నట్లు అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ని బట్టి అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అనుష్కని మరో బిగ్ ఛాన్స్ తలుపుతట్టినట్లు వార్తలొస్తున్నాయి. 250  కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ లో టైటిల్ రోల్ కి అనుష్కని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. 'సంఘమిత్ర' సినిమా నుంచి శృతిహాసన్ సైడ్ అయిన తర్వాత 'సంఘమిత్ర' లీడ్ రోల్ ఎవరు పోషిస్తారనే అంశంపై చాలా సస్పెన్స్ నడిచింది. ఇక ఈ రోల్ కోసం ఇప్పటికే తమన్నా, అనుష్క, కాజల్, దీపికా పదుకొనె పేర్లు గట్టిగానే వినబడ్డాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఆ రోల్ అనుష్కని వరించినట్లు చెబుతున్నారు.

అయితే ఈ విషయం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు చేబుతున్నారు. ఇక 'బాహుబలి' తో నేషనల్ స్థాయిలో పేరు సంపాదించుకున్న అనుష్క గనక 'సంఘమిత్ర' టైటిల్ రోల్ పోషిస్తే క్రేజ్ బాగా పెరుగుతుందని 'సంఘమిత్ర' మేకర్స్ భావిస్తున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో...!

Anishka Shetty Playing Title Role in Sangamithra Movie!:

But now Anushka is reported to have another Big Chance. Anushka has been approached by Anushka for the title role in the Sundar C Direct 'Sangamithra' project in Tamil with a 250 crore budget. But now the role is that the roll is rolled by Anushka.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs