Advertisement
Google Ads BL

పోలా.. అదిరిపోలా..!


బాహుబలి కోసం కండలు పెంచేసి సిక్స్ ప్యాక్ లాంటి బాడీని ప్రేక్షకులకు చూపించిన ప్రభాస్... బాహుబలి కోసం దాదాపు ఐదేళ్లు బరువును బాగా పెంచేశాడు.  మరి బరువును పెంచితే ఏంటి... అంతకుమించిన హిట్ ని అందుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. సారీ... సారీ.. ప్రభాస్ అమెరికాలో సేదతీరుతూ బాహుబలికి కష్టపడిన కష్టాన్ని మర్చిపోయాడు. అయితే ఇప్పటి వరకు అందరూ ఇలానే అనుకున్నారు.... బాహుబలి విజయాన్ని ఎంజాయ్ చేస్తూ అమెరికా లో ప్రభాస్ హాలిడేస్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అని..... కానీ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'సాహో' కోసం కండలు కరిగించే పనిలో ఉన్నాడనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్ ని చూస్తుంటే అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

అయితే అమెరికాలో కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడట. 'సాహో' చిత్రం కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న ప్రభాస్ ఆ పనిలో బిజీగా వున్నాడట. తాజాగా ప్రభాస్, ఆలిమ్ హకీమ్ తో కలిసి స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. మరి కేవలం ఒక్క నెలలో బాహుబలి లుక్ నుండి ఇలా కొత్తగా మేకోవర్ అవ్వడం మామూలు విషయం కాదు. కానీ ప్రభాస్ దాన్ని కేవలం ఒక్క నెల రోజుల్లో సాధించి చూపించాడు. ఇలా కొత్తగా మేకోవర్ అయిన ప్రభాస్ ని చూసినవారంతా పోలా...అదిరిపోలా.. అనే కామెంట్స్ పడేస్తున్నారు. 

ప్రభాస్ కున్న క్రేజ్ తో యూవీ క్రియేషన్స్ వారు 150  కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో ఈ 'సాహో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక సాహో చిత్రంలో ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డేని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కానీ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది..!

Prabhas in A Stylish Look With Alim Hakeem!:

Prabhas, who showed the body like a six pack, raised muscles for Baahubali and raised the weight for about five years for Baahubali. It is understood that the muscles for 'saaho' are in the melting point. Prabhas recently appeared in a stylish look with Alim Hakeem.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs