Advertisement
Google Ads BL

'స్పైడర్‌'ని చూస్తే భయమేస్తోంది..!


తెలుగులో ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్త తరహా చిత్రాలను, ప్రయోగాలను ఆదరిస్తున్నారు. కానీ నిశితంగా గమనిస్తే కొత్త కథనాలను పెద్ద హీరోలు చేస్తే చూస్తున్నారు. వినూత్న, విభిన్నమైన చిత్రాలను చిన్నవారు చేస్తే పట్టం కడుతున్నారు. ఇంకా మార్పు రావాల్సివుంది. కానీ మరీ సుకుమార్‌లా ఎక్కువ ప్రయోగం చూపించినా, కోలీవుడ్‌లా ఊహకందని చిత్రాలు చేసినా మరీ ముఖ్యంగా మన స్టార్స్‌ చేస్తే అభిమానులు, ప్రేక్షకుల జీర్ణించుకునే పరిస్థితి మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

అలాంటివి కేవలం మల్టీప్లెక్స్‌లు, ఓవర్‌సీస్‌లోనే వర్కౌట్‌ అవుతున్నాయి. కానీ సామాన్యులకు రుచించడం లేదు. ఇక మహేష్‌ విషయానికి వస్తే ఆయనకు మాస్‌, క్లాస్‌, యువత, లేడీస్‌.. అందరూ ఫ్యాన్స్‌ ఉన్నారు. తన కెరీర్‌లో మహేష్‌ కూడా కొన్ని ప్రయోగాలు చేశాడు. 'నాని, 1( నేనొక్కడినే), నిజం' వంటివి చేసినా ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. ఇక ఇప్పుడు మురుగదాస్‌తో చేస్తోన్న 'స్పైడర్‌' చిత్రం టీజర్‌తో మహేష్‌ మరోసారి సామాన్యులలో అనుమానపు బీజాలు నాటాడు. ఇదో బయోటెర్రరిజం నేపధ్యంలోని కథ అని, స్పైడర్‌ అనేది ఒక యంత్రమని వార్తలు వస్తున్నాయి. 

టీజర్‌ చూసిన వారు కూడా అదే చర్చించుకుంటున్నారు. ఇక ఈ టీజర్‌ యూట్యూబ్‌లో షేక్‌ చేస్తున్నా కూడా ఇది కూడా ఓ సైన్స్‌ఫిక్షన్‌ కథేమో అనే చర్చ నడుస్తోంది. మరి టీజర్‌తో ఇన్ని అనుమానాలు వస్తున్నా కూడా మురుగదాస్‌ అంటే ఏ పాయింట్‌నైనా సామాన్యులకు కూడా అర్దమయ్యేలా తీస్తాడనే ఏకైక నమ్మకంతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. మరి ఈ చిత్రం ట్రైలర్‌ వచ్చేదాకా మరింత సస్పెన్స్‌ తప్పదు. 

Mahesh Babu Film Spyder Update!:

Now the audience has become a passion for more than once in Telugu. Enjoy new images and experiments. When Mahesh comes in, he has mass, class, youth, ladies .. all the fans. Mahesh is once again Acting suspicious gossip in the comic strip with the teaser of the movie 'Spyder'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs