అల్లు అర్జున్ తాజా చిత్రం 'డిజె... దువ్వాడ జగన్నాథం' విడుదలకు ముందే వివాదాల్లో ఇరుక్కుంది. 'డిజె' పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదలవుతూ దుమ్ముదులుపుతుంటే మరోపక్క 'డిజె' పాటలపై బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ - పూజ హెగ్డేల మీద చిత్రీకరించిన 'గుడిలో బడిలో ఒడిలో' అనే సాంగ్ ని చిత్ర యూనిట్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ పాటలో అల్లు అర్జున్, పూజ ల డాన్స్ పెరఫార్మెన్సు బావుందని ఈ సాంగ్ తో యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారని... యూట్యూబ్ రికార్డ్స్ ని 'డిజె' బద్దలు కొడుతుందని ప్రచారం జరుగుతుండగా.... . బ్రాహ్మణ సంఘాలు మాత్రం ఆ పాటలోని లిరిక్స్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు ని సంప్రదించారు.
అయితే ఈ వివాదంపై స్పందించిన డీజే డైరెక్టర్ హరీష్ శంకర్.... నేను స్వతహాగా బ్రాహ్మణుడిని అని... బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదని.. పాటలోని పదాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించామని బ్రాహ్మణ సంఘాలను కోరుతున్నాడు. అలాగే దాదాపు 70 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నాము అంటే అది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగానే తీస్తామని... కేవలం ఒక వర్గాన్ని కించపరిచేలా అంత భారీ బడ్జెట్ ఎలా పెడతామని అంటున్నాడు.
ఇక దిల్ రాజు గారు కమిట్మెంట్ అందరికి తెలిసిందే. ఆయనకు దేవుడి మీద ఎంత భక్తి ఉంటుందో మీకందరికీ తెలుసు. ఆయన తన డబ్బుతో వెంకటేశ్వర స్వామివారికి గుడిని కట్టించి ఎంతో నిష్టగా పూజలు జరిపించారు.... అలాంటి ఆయన ఒకరిని కించపరిచేలా సినిమాలు ఎందుకు చేస్తారు.... షూటింగ్ పూర్తయిన తరువాత తాను అన్ని అంశాల పైనా వివరణ ఇస్తానని చెబుతున్నాడు హరీష్ శంకర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్ర జూన్ 23 న విడుదలకు సిద్ధమవుతోంది.