Advertisement
Google Ads BL

అమ్మాయిలకైతే అన్నీ ఫ్రీ అంటున్న చరణ్‌..!


లేడీస్‌ ఫస్ట్‌.. అనే దగ్గర నుంచి ఆడవారిని గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం.. వంటివి మనం అన్ని చోట్లా చూస్తూనే ఉంటాం.ఒకప్పుడు ఓ చిత్రం విడుదలైదంటే ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మిగిలితేనే మగవారికి టిక్కెట్లు ఇచ్చేవారు. ఇక మన హీరోలు కూడా ఎక్కువగా లేడీస్‌ ఫాలోయింగ్‌కి ప్రాధాన్యం ఇస్తారు. మగ అభిమానులు ఎలాగైనా తమ చిత్రాలను చూస్తారని, వారిని ఏమన్నా పట్టించుకోకుండా తమను ఆరాధిస్తారని వారికి తెలుసు. 

Advertisement
CJ Advs

అందుకే ఎంత ఖాళీగా ఉన్నా కూడా జంట్స్‌ ఫ్యాన్స్‌ తమ హీరోలను చూడటానికి వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తే కోపం చూపిస్తారు. అదే లేడీస్‌ ఫ్యాన్స్‌ వస్తే ఎంత బిజీగా ఉన్నా కూడా వారికంటూ సమయం కేటాయించి, నవ్వుతూ ఫొటోలు దిగుతారు. ఇక విషయానికి వస్తే సుకుమార్‌ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ఈ ఎండల దెబ్బకు రామ్‌ చరణ్‌, తన భార్య ఉపాసనతో కలిసి లండన్‌ వెళ్లాడు. 

అక్కడ కూడా మన తెలుగువారు చాలా మందే ఉన్నారు. దాంతో వారు చరణ్‌ని చూసి తమ వీడియోలలో బంధిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి చరణ్‌తో ఫొటో దిగాలని భావించి, అక్కడి పద్దతుల ప్రకారం మీతో ఫొటో దిగినందుకు ఎంత చార్జ్‌ చేస్తారు? అని చరణ్‌ని అడిగింది. దానికి చరణ్‌ నవ్వుతూ, నీకైతే ఫ్రీ డార్లింగ్ అంటూ ఫొటో దిగాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది..! 

Ram Charan and Upasana in Visited London!:

Let's respect the ladies first .. Let them sit in the seats allotted to them. Our heroes are also more likely to follow the ladies follow. Sukumar's first schedule was completed and Ram Charan and his wife, along with his wife, went to London for this sank. How would you charge a photo of a girl with a fresh look at the scene? Asked Charan. Charan laughs and he's got a free darling.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs