Advertisement
Google Ads BL

వామ్మో 'స్పైడర్' స్పీడ్ ను ఆపడం కష్టమే!


మహేష్ బాబు 'స్పైడర్' టీజర్ ఇప్పుడు సంచలనాలను క్రియేట్ చేస్తుంది. మురుగదాస్ డైరెక్షన్ లో 'స్పైడర్' చిత్రంలో మహేష్ - రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇప్పటి వరకు ఇదొక గూఢచారి కథతో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు 'స్పైడర్' టీజర్ ని చూస్తుంటే ఇదొక సైంటిఫికల్‌ ఫిక్షన్‌ మూవీ అనే ప్రచారం మొదలైంది.

Advertisement
CJ Advs

తాజాగా విడుదల చేసిన 'స్పైడర్' టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. టీజర్ విడుదలైన ఐదు గంటల్లో రెండు మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీజర్ 24  గంటల్లో నాలుగు మిలియన్ వ్యూస్ ని పూర్తి చేసుకుని ఐదు మిలియన్ వ్యూస్ కి దగ్గరగా వుంది. అలాగే స్పైడర్ టీజర్ కి దాదాపు రెండు లక్షల లైక్స్ యూట్యూబ్ లో వచ్చాయి అంటే మహేష్ కున్న క్రేజ్ ఎలా ఉందొ చూశారా....  మురుగదాస్ -మహేష్ కాంబినేషన్ మీద సినిమా మొదలైనప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 100  కోట్ల భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ విషయంలోనూ, టీజర్ విషయంలోనూ జాప్యం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమా విడుదల విషయంలో పర్ఫెక్ట్ గా దసరాకి రిలీజ్ అని టీజర్ లో చెప్పకనే చెప్పారు.

Spyder Teaser Response!:

Prince Mahesh's Spyder film teaser was released this morning and received breathtaking response from fans. The teaser hit 3 million views in 9.5 hours and 151K likes on youtube which is said to be a record. The film, which has the backdrop of bio-terrorism, has been made as an action packed entertainer.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs