Advertisement
Google Ads BL

అబ్బో.. నిర్మతలకు పెద్ద షాక్ ఇస్తుందట..!


బాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా తన గ్లామర్ షో తో నిత్యం వార్తల్లో నిలిచే భామ దిశా పటాని. నిత్యం ఎదో ఒక ఫోటో షూట్ తోనో లేక హాట్ హాట్ డాన్స్ వీడియోలతో మత్తెక్కించే ఈ భామకు కాస్త తలపొగరు ఎక్కువనే అంటున్నారు. ఎప్పుడూ గ్లామర్ షో తో సందడి చేసే ఈ భామ సినిమాల విషయానికి వచ్చేటప్పటికి నిర్మాతల నెత్తినెక్కితొక్కడానికి రెడీ అయిపోతుందట. ఏ చిత్రంలోనైనా లీడింగ్ హీరోయిన్ గా కనిపిస్తానని డిమాండ్ చెయ్యడం, భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చెయ్యడం వంటివి చేసి నిర్మతలకు పెద్ద షాక్ ఇస్తుందట.

Advertisement
CJ Advs

మరి ఆమె కెరీర్ ఇప్పుడే మొదలైంది. కానీ ఏదో పెద్ద ఆరిందాలా ఇలాంటి డిమాండ్స్ చేయడం వలన ఆఖరికి ఉన్నది... ఉంచుకున్నదీ రెండూ పోతేగాని ఇలాంటి వాళ్ళకి బుద్దిరాదనే కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ఇప్పుడు ఇంతగా దిశా మీద సోషల్ మీడియాలో నెగెటివ్ గా ప్రచారమవడానికి ఒక కారణం వుంది. అదేమంటే ఆ మధ్యన ప్రభాస్ కి జోడిగా సాహో చిత్రంలో దిశా పటాని ని సెలెక్ట్ చేస్తున్నారనే వార్తలొచ్చాయి. అయితే నిజంగానే సాహో యూనిట్ దిశాని సాహో లో నటించమని సంప్రదించగా ఏకంగా తన రెమ్యునరేషన్ కింద ఐదు కోట్లు డిమాండ్ చేసిందట. 

ఆ ఫిగర్ చూసి షాక్ తిన్న సాహో యూనిట్ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ని ఈ చిత్రానికి తీసుకున్నా వారికి  2  కోట్లు ఇస్తామంటే కళ్ళకద్దుకుని సినిమా చేస్తారని భావించి దిశాని ఈ సినిమా నుండి తప్పించారని అంటున్నారు. అలాగే దిశాతో  ఇప్పటికే ఒప్పందం చేసుకున్న ట్యాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి కూడా.... దిశా డిమాండ్స్ కి  బెదిరిపోయి ఆమెతో అగ్రిమెంట్ తెగతెంపులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ టాక్.

Disha Patani Demand More Remuneration:

Bollywood has done two movies, but with her glamor show in the daily news. Demanding a huge remuneration will give a big shock to the Producers.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs