Advertisement
Google Ads BL

రాజమౌళి తదుపరి చిత్రం దాదాపు కన్‌ఫర్మ్‌..!


'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' తర్వాత ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఫ్యామిలీ వెకేషన్స్‌కి వెళ్లిన రాజమౌళి దానిని ముగించుకుని వచ్చాడు. వచ్చిన వెంటనే తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథా చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ చిత్రం స్టోరీలైన్‌ని కూడా లాక్‌ చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆయన 'బాహుబలి'కి ముందు జరిగిన అగ్రిమెంట్‌ ప్రకారం ప్రముఖ నిర్మాత డివివి దానయ్యకు చేయనున్నాడు. 

Advertisement
CJ Advs

మరో ఆరునెలల పాటు ఇదే కథకు సంబంధించిన చర్చలు, కసరత్తులో జక్కన్న నిమగ్నమవుతున్నాడని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించే ఈ సినిమా యాక్షన్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో పెద్దగా గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లకు చోటు లేదని అంటున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి చిత్రాలపై నెలకొన్న భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాజమౌళికి రెగ్యులర్‌టీంలో పనిచేసే అందరూ ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. మొత్తానికి 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్‌ అంచనాలు ఉన్నప్పటికీ దానికి తగ్గకుండానే తన తదుపరి చిత్రం విషయంలో జక్కన్న పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 

ఇక ఈ చిత్రం బడ్జెట్‌ కూడా బాహుబలితో లింక్‌ పెట్టడం సరికాదని, ఇది దేశవ్యాప్తంగా, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ స్థాయిలో కాకుండా కేవలం టాలీవుడ్‌ స్థాయిలోనే నిర్మితమవుతుందంటున్నారు. ఇక గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లకు పెద్దగా చోటులేకపోయినా 'ఛత్రపతి, సింహాద్రి' టైపులో హైరేంజ్‌ యాక్షన్‌తో, ఎమోషనల్‌ డ్రామాగా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ తన తదుపరి చిత్రాన్ని సుజీత్‌ దర్శకత్వంలో యువిక్రియేషన్స్‌ బేనర్‌పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'సాహో' చేయనున్నాడు. కాగా దానయ్య చిత్రంలో కూడా ప్రభాసే హీరో అనే మాట వినిపిస్తోంది. కానీ స్టోరీ ఫైనల్‌ అయిన తర్వాత, స్క్రిప్ట్‌ను లాక్‌ చేసిన తర్వాత మాత్రమే నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రం ఈ ఏడాది చివరి నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రభాస్‌ ఈ చిత్రంలో నటించే అవకాశం లేదని, వరుసగా ఐదేళ్లు రాజమౌళికి రాసిచ్చిన తర్వాత వెంటనే మరో చిత్రం ఆయనతోనే చేసే అవకాశం లేదంటున్నారు. కొందరు మాత్రం ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ నటిస్తాడని, ఇది కన్‌ఫర్మ్‌ అని, రాజమౌళి స్క్రిప్ట్‌ లాక్‌ చేయందే నటీనటుల ఎంపిక చేయడం జరగకపోయినా, దానయ్య మాత్రం తన వద్ద ఉన్న బన్నీ డేట్స్‌కి అనుగుణంగానే ఈ చిత్రం ఉండేట్లు చూడమని రాజమౌళిని కోరుతున్నాడట. ఇక 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ఇది కావడంతో సాధారణంగా రాజమౌళికి ఇచ్చే పర్సెంటేజ్‌ కంటే ఎక్కువ మొత్తాన్ని దానయ్య జక్కన్నకు ఆఫర్‌ చేశాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Rajamouli's Next Film is Almost Confirmed!:

After 'Baahubali-The Conclusion', Rajamouli went to family vacations after enjoying the success. As soon as he arrives, the story talks about his next film.The film is also locked in a storyline.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs