నేటి స్పీడ్‌యుగంలో ఎంత పెద్ద దర్శకుడైనా వరుసగా రెండు మూడు ఫ్లాప్‌లొస్తే ఇంతే సంగతులు. స్టార్స్ కాదు కదా చిన్న హీరోలు కూడా మొహం చాటేస్తారు. ఇక నేడు రోజుకో కొత్త యంగ్‌డైరెక్టర్ ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్నారు. శ్రీనువైట్ల, మెహర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి, ఏయస్ రవి కుమార్ చౌదరి వంటి ఎందరో దిక్కుమొక్కులేకుండా ఉన్నారు. కానీ వీరిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ స్టైలే వేరు.
'బిజినెస్‌మేన్' తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు. 'హార్ట్‌ఎటాక్' జస్ట్‌ఓకే. 'జ్యోతిలక్ష్మి, లోఫర్, రోగ్' ఇలా వరుస పరాజయాలు. అయినా ఆయన ఖాళీగా ఉండదు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి పడిలేస్తూ అంతే వేగంతో వస్తుంటాడు. 'టెంపర్' తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆయన ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌లో ఆనంద ప్రసాద్ నిర్మాతగా బాలయ్య 101వ చిత్రం తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. పాటలను నేచురల్ లోకేషన్లలో తీయడం, సెట్ల కోసం భారీగా ఖర్చుపెట్టకపోవడం, ఫైట్స్‌ని కూడా సింపుల్ లోకేషన్లలో తీయడం, అనుకున్న బడ్జెట్ లోపు చిత్రం పూర్తి చేసి సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు తేకపోవడం ఆయన స్టైల్.
కాగా ఆయన 'రోగ్' చిత్రం కోసం 17కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక బాలయ్య చిత్రాన్ని కేవలం 35కోట్లలో తీస్తానని ఆయన నిర్మాతలకు హామీ ఇచ్చాడు. ఇందులో 10కోట్లు బాలయ్య రెమ్యూనరేషన్. ఇక 35కోట్ల బడ్జెట్‌లో 10కోట్లు బాలయ్య రెమ్యూనరషన్ పోను, మిగిలిన చిత్రాన్ని ఆయన 15కోట్ల లోపు పూర్తి చేయనున్నాడట. అంటే ప్యాకేజీ ప్రకారం ఈ చిత్రానికి పూరీకి రెమ్యూనరేషన్ కింద 10 నుంచి 12కోట్లు మిగులుతాయని సమాచారం. అంటే బాలయ్య రెమ్యూనరేషన్‌తో సమానంగా ఫ్లాప్‌లో ఉన్న పూరీ రెమ్యూనరేషన్ కూడా ఉండటం గ్రేటే.. దటీజ్ పూరీ జగన్నాథ్....!