Advertisement
Google Ads BL

నాగ్‌ నమ్మకాన్ని నిలబెట్టిన కళ్యాణ్‌ కృష్ణ..!


తనకు మొదటి చిత్రంతోనే 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌ బస్టర్‌నిచ్చిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మీద ఎంతో నమ్మకంతో తానే నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం అవకాశాన్ని నాగ్‌ ఎంతో నమ్మకంతో కళ్యాణ్‌ కృష్ణకు ఇచ్చాడు. ఈ సినిమా ప్రెస్‌మీట్లలో, ఇంటర్వ్యూలలో కూడా ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందని, చైతు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నమోదవుతుందనే ఆశాభావం ఎంతో నమ్మకంతో వ్యక్తపరిచాడు. 

Advertisement
CJ Advs

నాగ్‌ అనుకున్నట్లే ఈ చిత్రం ఇప్పుడు మంచి కలెక్షన్లతో దూసుకెళ్లుతోంది. స్ట్రాంగ్‌ వీకెండ్‌ తర్వాత వీక్‌డేస్‌లో కూడా మంచి స్ట్రాంగ్‌ కలెక్షన్లు రాబడుతోంది. కేవలం విడుదలైన ఐదురోజుల్లోనే 15కోట్ల షేర్‌ను సాధించింది. దాదాపు శుక్ర, శనివారాల కల్లా ఈ చిత్రం బ్రేకీవన్‌ సాధించడం ఖాయం. ఇక ఆదివారం నుంచే బయ్యర్లకు, నిర్మాతకు లాభాలు మొదలుకానున్నాయి. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ వల్ల 'సాహసం శ్వాసగా సాగిపో' కాస్త నిరాశ పరిచింది. 

'ప్రేమమ్‌' చిత్రం ఎంతో బాగా ఉన్నప్పటికీ భారీ విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది. మొత్తానికి నాగ చైతన్య కెరీర్‌లోనే 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం అతి పెద్ద హిట్‌గా నిలవనుంది. మొత్తానికి నాగ్‌, చైతూల నమ్మకాన్ని కళ్యాణ్‌ కృష్ణ వమ్ముచేయలేదని చెప్పవచ్చు.సో..కళ్యాణ్‌ కృష్ణ రూపంలో ద్వితీయ విఘ్నాన్ని అధిరోహించిన ఆయన ఇక యంగ్‌స్టార్స్‌ దృష్టిలో పడటం కూడా ఖాయమనే చెప్పాలి. ఆల్‌ ది బెస్ట్‌ టు కళ్యాణ్‌ కృష్ణ. 

Raarandoy Veduka Chuddam - Steady Collections:

Nag was very confident about Kalyan Krishna's chance to see 'Randhoya Celebration' with Naga Chaitanya and Rakul Preet Singh in Annapurna Studios Banner as the producer of the blockbuster director Kalyan Krishna. Like Nag, the film is now flying with good collections. Strong Collections are also rewarded in Weekly after Strong Weekend.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs