Advertisement
Google Ads BL

అంతా 'స్పై' లా వుంది...!


మహేష్ ఫ్యాన్స్ సహనం నశించేంత స్థాయిలో వెయిట్ చేసిన వారికి 'స్పైడర్' టీజర్ ఇప్పుడు ఒక అమృతంలా కనిపిస్తుంది. ఈ టీజర్ ని వీక్షించిన వారికి  పట్టలేని సంతోషంగా వుంది. తమ అభిమాన  హీరో టీజర్ అదిరిపోయే లెవల్లో ఉందనే కామెంట్స్ పడిపోతున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్' చిత్ర టీజర్ ఈ రోజు గురువారం ఉదయం 10  గంటలకి విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటెలీజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మెయిన్ హైలెట్స్... గ్రాఫిక్స్ అని ఎప్పటి నుండో చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు 'స్పైడర్' టీజర్  చూస్తుంటే ఆ గ్రాఫిక్స్ సినిమాకి ఎంత హైలెట్ అవుతాయో అర్ధమవుతుంది. గూఢచారి కథని తలపించే రీతిలో 'స్పైడర్' చిత్రం తెరకెక్కుతోందని... స్పై అనే పదం చూస్తుంటే తెలుస్తుంది. 'స్పైడర్' టీజర్ లో మెకానికల్ స్పైడర్ తో మెస్మరైజ్ చేస్తూ మహేష్ బూటు మీదకి ఎక్కి... పై పైకి పాకుతూ భుజాలమీదకి ఎక్కి అటు ఇటు చూస్తున్న స్పైడర్.... లాప్ టాప్ లో తలమునకలైన మహేష్ ఒక్కసారిగా పక్కకి తిరిగి హుష్...... అనడంతో స్పైడర్ టీజర్ ఎండ్ అవుతుంది.

'స్పైడర్' టీజర్ చూస్తుంటే గ్రాఫిక్స్ తో విసువల్ వండర్ గా  హాలీవుడ్ రేంజ్ లో మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కి జోడిగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం దసరాకి రిలీజ్ అంటూ టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసింది మురుగదాస్ అండ్ టీమ్.

Spyder Teaser Released!:

The long wait has been ended. The highly prestigious film of South India Spyder film's teaser has been unveiled by the makers some time ago. AR Murugadoss kept everybody calm with his stunning creation of 'Robo Spyder'. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs