Advertisement
Google Ads BL

చిరుకు నో..ప్రభాస్‌కి ఓకే...!


'బాహుబలి'తో నేషనల్‌స్టార్‌ అయిపోయిన ప్రభాస్‌ నటించనున్న తదుపరి చిత్రం 'సాహో' పై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న చిత్రమైన దీని టీజర్‌ కూడా ఆల్‌రెడీ విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం విషయంలో యువిక్రియేషన్స్‌ అధినేతలు, దర్శకుడు సుజీత్‌లు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను స్పీడ్‌ పెంచారు. 

Advertisement
CJ Advs

నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్‌ నటీమణులు, అనుష్క పేరు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్‌ కాలేదు. ఇక ప్రభాస్‌ తర్వాత ఈ చిత్రం కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేసిన రెండో వ్యక్తిగా బాలీవుడ్‌ హీరో, విలన్‌ నిల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్‌ సంతకం చేశాడు. ఇంతకు ముందు జాకీష్రాఫ్‌ పేరుతో పాటు పలువురి పేర్లు వినిపించినా చివరకు నీల్‌ నితిన్‌ని ఒప్పించారు. ఈయన ఇటీవల సల్మాన్‌ నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' అమితాబ్‌ నటించిన 'వజీర్‌' చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 

ఈయన్ను చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్‌ 150'లో నటించమని అడిగినా కూడా నో చెప్పాడు. ఇక ఈ మధ్య ఎన్టీఆర్‌ నటిస్తున్న 'జై లవ కుశ'లో ఇతనే విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 'సాహో'లో నీల్‌నితిన్‌ పాత్ర టెర్రిఫిక్‌గా అద్భుతంగా ఉంటుందట. ప్రభాస్‌తో అతని పోరాటాలు, సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ప్రభాస్‌ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలను ఆయన కజిన్‌ తోసిపుచ్చారు. తాము అధికారికంగా ప్రకటించే వరకు ఏ మాటలను వినవద్దని ఆయన విన్నవించాడు. 

Chiranjeevi's No.. Prabhas's Ok!:

Prabhas, who is a nationalist with 'Baahubali', has a huge expectation of the next film 'Saaho'. Villain Neil Nitin Mukesh has signed the villain. Neil previously credited with the names of Jackiefroff, but finally Neil persuaded Nitin.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs