బాలీవుడ్‌లో,కోలీవుడ్‌లో హీరో కూతుర్లు, హీరోయిన్ల కూతుర్లు కూడా వారసురాళ్లుగా వెండితెరకు పరిచయమవుతుంటారు. వారిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు. కొందరు ఆర్ధికంగా చితికిపోయిన హీరోల, హీరోయిన్ల కుటుంబాలను వారి కూతుర్లే సినీ రంగంలో బాగా రాణించి ఒడ్డున పడేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఇంకా రాలేదు. ఇక బాలీవుడ్‌కి వస్తే శ్రీదేవి, బోనీకపూర్‌లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
వారి బాధలను తీర్చడానికి త్వరలో శ్రీదేవి కూతుర్లు హీరోయిన్లుగా రానున్నారు. ఇక ఎందరో హీరోల కూతుర్లు, శత్రుఘ్నుసిన్హా నుంచి ఎందరినో వారి కూతుర్లు ఆదుకున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం ఒకానొక దశలో అప్పుల్లో కూరుకుపోయింది. అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. దాంతో వారిని వారి కోడలు ఐశ్వర్యారాయ్ ఆర్ధికంగా ఆదుకుంది. ఇక కోలీవుడ్‌లో కమల్‌హాసన్, అర్జున్, శరత్‌కుమార్ వంటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కూతుర్లే ఆదుకున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ కృష్ణ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం, ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు పెద్దగా రాణించకపోవడంతో కృష్ణ కుమార్తె మంజుల కూడా గ్లామర్ హీరోయిన్‌గా అవతారం ఎత్తాలని భావించి, ఎస్వీకృష్ణారెడ్డి-బాలకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 'టాప్‌హీరో'లో చేయడానికి సిద్దమైంది.
కానీ కృష్ణ అభిమానులు ఒప్పుకోలేదు. చివరకు మహేష్ రూపంలో కృష్ణకు మంచి అండ దొరికింది. ఇక మెగా బ్రదర్ నాగబాబుది కూడా అదే పరిస్థితి. దాంతో నటనపై ఉన్న ఆసక్తితో ఆయన కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా మరలా ఫ్యాన్స్ పుణ్యమా అని మౌనంగా ఉంటోంది. ఇక విషయానికి వస్తే యాంగ్రీ ఓల్డ్‌మేన్ రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా ఓ ఊపులో ఉన్నాడు. ఆ తర్వాత తన భార్య జీవితతో తాను సొంతంగా నిర్మించిన చిత్రాలతో పాటు, ఇతర దర్శకులతో తాను సొంతంగా నిర్మించిన చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఈమధ్య ఆయన పరిస్థితి మరింత దీనంగా మారింది.
దాంతో ఆయన తన కూతుర్లను హీరోయిన్లను చేయాలని భావిస్తున్నాడు. జీవిత కూడా అందుకు సముఖంగానే ఉంది. ఇప్పటికే రాజశేఖర్ కూతురు శివానికి పలు చిత్రాలలో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అదే ఉద్దేశ్యంతో ఓ పెద్ద నిర్మాత సంస్థ, ఓ పెద్ద దర్శకుడు, ఓ స్టార్ యంగ్ హీరో చిత్రంతో మాత్రమే ఆమెను తెరంగేట్రం చేయించాలని ఈ దంపతులు భావిస్తున్నారు. దీంతో శివానీ సినీ తెరంగేట్రానికి ముందే మంచి క్రేజ్ తెచ్చుకోవడం కోసం హాట్ ఫొటో షూట్లు చేస్తోంది. శివానికి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
వీటిని చూసిన వారు శివానీ ఇంతకు ముందుకంటే అందంలోనే, గ్లామర్‌పరంగా ఆమె మరింత బాగా ఉందని అంటున్నారు. శివానీలో అందంతో పాటు సెక్స్‌అప్పీల్ కూడా సూపర్‌గా ఉంది. ఒక యాంగిల్‌లో ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాలా ఉందని అంటున్నారు. ఆమె అందానికి, సెక్స్‌అప్పీల్‌కు ఆమె పెర్ఫార్మెన్స్ కూడా తోడైతే ఆమె సక్సెస్ కావడం గ్యారంటీ అంటున్నారు. శివాని డ్యాన్స్, నటనలో కూడా శిక్షణ తీసుకుంటోంది. ఎలా మసలు కోవాలి అనే విషయాలను తన తల్లి జీవిత నుంచి నేర్చుకుంటోంది. శివానిని తెలుగులో కంటే ముందు తమిళంలో ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తున్నారట. మొత్తానికి ఈమె రాజశేఖర్-జీవితల ఆర్థిక ఇబ్బందులను ఒడ్డున పడేస్తుందో లేదో చూడాలి....!