నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా అశ్వినీదత్ ప్రొడ్యూసర్ గా మహానటి సావిత్రి చిత్రం సైలెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం ఎనౌన్స్ చేసిన చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ ని ఇంతకాలం మొదలు పెట్టకపోవడానికి కారణం నటీనటుల ఎంపిక ఒక ఎత్తైతే మహానటి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చాలని నాగ్ అశ్విన్ అనుకోబట్టే ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయ్యిందని అంటున్నారు. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ని మహానటి సావిత్రి పాత్రకి ఎంపిక చేసినట్లు.... సమంత ని జర్నలిస్ట్ పాత్రకి ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు సమంత మహానటి సావిత్రి గెటప్ లో దర్శనమిచ్చే కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వంటినిండా నగలతో సావిత్రి గెటప్ లో సమంత లేటెస్ట్ గా దిగిన ఫొటోలతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. మరో పక్క కీర్తి సురేష్ లుక్ కూడా లీక్ అయ్యింది. ఆమె కూడా సావిత్రి గెటప్ లోనే దర్శనమిస్తుంది. మరి ఈ ఫొటోస్ తో అంతా గందరగోళంగా తయారవడం అటుంచి ఈ ఫొటోస్ ఎలా లీకవుతున్నాయో తెలియక డైరెక్షన్ డిపార్ట్మెంట్ తలలు పట్టుకుందట. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ ఫోటో లీకుల వ్యవహారంలో చిరాకుగా వున్నాడని అంటున్నారు.