పాపం మహేష్ అభిమానులు ఎప్పటి నుండో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' చిత్ర టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. 'స్పైడర్' టీజర్ లెక్క ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదలకావాల్సి వుంది. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూతతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ శోకసముద్రంలో ఉండడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు సినిమా పరిశ్రమ అంతా బంద్ పాటిస్తుంది. ఇక ఆయన మృతికి సంతాప సూచకంగా స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ను ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. అయితే వాయిదా వేయడంతో పాటు 'స్పైడర్' చిత్ర టీజర్ విడుదలకు కొత్త తేదీని కూడా ప్రకటించారు మేకర్స్.
జూన్ 1 అంటే రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. అనుకున్న తేదీ కంటే ఒకరోజు లేట్ గా ఈ టీజర్ విడుదల కాబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీకి సంబంధించి రెండు పాటల మినహా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు చెబుతున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి 'స్పైడర్' చిత్రాన్ని వచ్చే దసరా బరిలో నిలపాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.