Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ తెగ దున్నేస్తున్నాడు..!


'డిజె... దువ్వాడ జగన్నాథం' ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో యూట్యూబ్ ని షేక్ చేసిన దువ్వాడ ఇప్పుడు మరోమారు పాటల రూపంలో రెచ్చిపోతున్నాడు. అల్లు అర్జున్ - పూజ హెగ్డే హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న 'డిజె' చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి డిజె పై హై ఎక్సపెక్ట్షన్స్ వున్నాయి. 'దువ్వాడ జగన్నాథం' టీజర్ ఏ రేంజ్ లో యూట్యూబ్ ని అల్లాడించిందో ఇప్పుడు అదే దోవలో డిజె పాటలు కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. చాలా తక్కువ టైమ్ లో డిజె టీజర్ 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు పాటల టైమ్ వచ్చీసింది.

Advertisement
CJ Advs

ఈ మధ్యన డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదలైన 'శరణం భజే భజే' సాంగ్ కి కూడా భారీ లైక్స్ వచ్చాయి. ఇంకా శరణం భజే సందడి యూట్యూబ్ ని వదలకముందే ఇప్పుడు 'గుడిలో బడిలో మదిలో' అంటూ డ్యూయెట్ సాంగ్ తో మరోమారు యూట్యూబ్ పై దండెత్తాడు అల్లు అర్జున్.  అల్లు అర్జున్, పూజ హెగ్డేతో కలిసి వేసిన స్టెప్స్.... దేవిశ్రీ ఎంటర్టైనింగ్ ట్యూన్ ఈ పాటని ఒకలెవల్లో హిట్ చేసేశాయి. అయితే ఈ సాంగ్ కి  ప్రధాన ఆకర్షణ మాత్రం హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ అంటున్నారు అందరూ. మరి అల్లు అర్జున్ డిజె చిత్రంపై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో ఈ యూట్యూబ్ రికార్డ్స్ ని బట్టి  అర్ధమవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ డిజె చిత్రం జూన్ 23  న ప్రేక్షకులముందుకు రావడానికి రెడీ అవుతుంది..!

DJ-Duvvada Jagannadham Movie YouTube Update!:

'DJ ... Duvvada Jagannatham' vibes began. The 'Duvvada Jagannadham' teaser has unveiled the YouTube on any range of songs in the same way.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs