ఎన్టీఆర్ స్టార్ మా ఛానల్ లో 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా మరుతున్నాడని నిన్నటి నుండి మీడియాలో ఒకటే న్యూస్ ప్రచారం అవుతుంది. 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'బిగ్ బాస్' షో ని మా టీవీ వారు ఇక్కడ తెలుగులో షో చెయ్యడానికి రైట్స్ ని చేజిక్కిన్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి ఈ 'బిగ్ బాస్' షో ఒక్క సీజన్ చేసినందుకు గాను దాదాపు ఎనిమిది కోట్ల పారితోషకాన్ని ముట్టజెబుతున్నారట. మరి ఒక్క సీజన్ కి 8 కోట్లు అంటే మాటలు కాదు.
'మీలో ఎవరు కోటీశ్వరుడు' హోస్ట్ గా చేసిన నాగార్జున, చిరంజీవులు అంత పెద్ద మొత్తం అందుకోలేదు. చిరంజీవికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చేసినందుకు గాను 4 కోట్లు ఇచ్చారు. అదీ ఒక్క సీజన్ కి మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఏకంగా 8 కోట్లు ఇచ్చేస్తున్నారు. అసలు 'బిగ్ బాస్' ఒక్క సీజన్ అంటే కేవలం 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఒక్క సీజన్ కే పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి ఎన్టీఆర్ ని బుట్టలో పడేసింది మా ఛానల్. ఇక ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ కింద 15 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. మరి 'బిగ్ బాస్' ఒక్క సీజన్ కే 8 కోట్లు తీసుకుని రికార్డు సృష్టించినట్లే.
మరో వైపు ఎన్టీఆర్ ని హోస్ట్ గా చెయ్యడానికి నాగార్జున, చిరంజీవులు వెనకుండి కథనడిపించారనే వార్తలొస్తున్నాయి. మా టీవీ స్టార్ చేతిలోకి వెళ్లిపోయినా... దానితో నాగ్, చిరులకి మంచి సంబంధాలు వున్నాయి. అందుకే మా టీవీ వారు 'బిగ్ బాస్' షో కి హోస్ట్ ఎవరైతే బావుంటుందని నాగ్, చిరు ల సలహా అడగగా వారు ఎన్టీఆర్ పేరుని సూచించినట్లు సమాచారం.