రజినీకాంత్ తాజా చిత్రం 'రోబో 2 .0' ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇంకా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే రజినీకాంత్ తన నెస్ట్ మూవీ ని కూడా స్టార్ట్ చేసేశాడు. 'కబాలి' ఫేమ్ రంజిత్ పా డైరెక్షన్ లో రజినీ అల్లుడు నిర్మాణ సారధ్యంలో 'కాలా' చిత్రాన్ని స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు రజినీ. రజినీ గత చిత్రం 'కబాలీ'కి పని చేసిన యూనిట్ సభ్యులంతా ఈ చిత్రానికీ పని చేయడం విశేషం.
ఈ నెల 28న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన 'కాలా కరికాలన్' షూటింగ్ జోరుగా సాగుతోంది. 28న ప్రారంభమైన షూటింగ్ రెండో రోజైన 29న కూడా కొనసాగింది. వడాలా ప్రాంతంలో జరిగిన షూటింగ్ గ్యాప్ లో రజినీకాంత్ ని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఈ చిత్రం మొదలవ్వకముందే ఈ చిత్రానికి విపరీతమైన ప్రమోషన్ వచ్చేసింది. రజినీ స్టైల్ దగ్గర నుండి రజినీ నడిపే వాహనం వరకు అన్నిటీకి మంచి పబ్లిసిటీతో పాటు ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ముంబై మాఫియా డాన్ కరికాలన్ కథతో తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ కాలా చిత్రంలో విలన్ గా పాపులర్ బాలీవుడ్ నటుడు నటిస్తున్నాడు.ఆయన ఎవరో కాదు .. నసీరుద్దీన్ షా. జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న నసీరుద్దీన్ షా ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ కి జోడిగా హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుంది.