Advertisement
Google Ads BL

శృతి హాసన్ పై న్యూస్ కోలీవుడ్ లో హల్చల్..!


తమిళంలో ఇప్పుడు అతిపెద్ద భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న'సంఘమిత్ర' మీదే అందరి కళ్ళు ఉన్నాయి. 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుందర్ సి. ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ గా ప్రారంభించేసిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్. ఇక ఈ 'సంఘమిత్ర' మూవీ కోసం శృతి హాసన్ ఎంతో కష్టపడి కత్తి సాము.. గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుంది. ఇక ఈ శృతి హాసన్ యుద్ధ విన్యాసాల కోసం మూవీ మేకర్స్ బోలెడు తగలేశారు. ఇక ఈ చిత్రం మొదలై 10  రోజులు గడవకముందే 'సంఘమిత్ర' మూవీపై ఇప్పుడొక న్యూస్ కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అదేమిటంటే ఇంత భారీగా మొదలు పెట్టిన 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్రధారిణి.. టైటిల్ రోల్ పోషించాల్సిన శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా... అసలు శృతి హాసన్ కి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకాక మేకర్స్ తలలు పట్టుకున్నారు. మరి 'సంఘమిత్ర' కోసం సర్వం సిద్ధమైన శృతి ఒక్కసారిగా ఇలాంటి డెసిషన్ ఎందుకుతీసుకుందో గాని ఇప్పుడా మూవీ మేకర్స్ మాత్రం మరో హీరోయిన్ వేటలో పడ్డారని వినికిడి. పాపం మరో హీరోయిన్ ని వెతికి ఎలాగో పట్టుకున్నా మళ్లీ ఆమెకు కత్తి సాము, గుర్రపుస్వారీలు గట్రా నేర్పించాలిగా.

మరో పక్క శృతి హాసన్ పాత్రకి బాహుబలి ఫేమ్ అనుష్కని తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే అనుష్క బాహుబలి కోసం కత్తి యుద్ధం వంటివి నేర్చుకుని ఉందిగనక అనుష్క అయితే బావుంటుందని ఉద్దేశ్యంతో 'సంఘమిత్ర' నిర్మాతలు అనుష్కని అప్రోచ్ అయ్యేపనిలో ఉన్నట్లు టాక్ వినబడుతుంది.

Shruti Haasan out from Sangamithra:

Within a couple of days after Shruti Haasan enraptured the spectators with her dazzling looks in glittering outfits at Red Carpet of Cannes, she had to walk out from India's expensive project Sangamithra. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs